కెరమెరి(ఆసిఫాబాద్): కుమురంభీం జిల్లాలో ఈ ఏడాది వర్షాలకు వాగులు పొంగిపొర్లుతుండడంతో వాగు అవతలి గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతం. సాధారణ ప్రజలే కాకుండా రోగులూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులు, గర్భిణులను కొన్నిసార్లు చేతులపై, ఇంకొన్నిసార్లు మంచంపై వాగు దాటించిన సంఘటనలు తెలిసిందే. తాజాగా కెరమెరి మండలం బోరిలాల్‌గూడ గ్రామానికి చెందిన ఆడే నాందేవ్ శుక్రవారం రాత్రి అనారోగ్యానికి గురయ్యాడు.
ఓ వైపు పొంగిపొర్లుతున్న అనారపల్లి వాగు, మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న రోగి.. ఈ పరిస్థితుల్లో అతన్ని శనివారం ఆరుగురు కుటుంబ సభ్యులు డోలీపై పడుకోబెట్టి వాగు దాటించారు. అనార్‌పల్లి నుంచి జీపుపై కెరమెరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం చేయించారు. అనంతరం మళ్లీ వాగు దాటించి ఇంటికి చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment