ఉలాన్ బాతర్: కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం అన్ని దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు ఈ వైరస్ బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితి గట్టెక్కేందుకు విశ్వమంతా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఒక దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించలేక ఏకంగా ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం మంగోలియా దేశంలో వచ్చింది. కరోనా ప్రారంభ దశలో మంగోలియా కట్టడి చర్యలు పటిష్టం తీసుకుంది.
(చదవండి: 7 లక్షల మందికి వ్యాక్సిన్ ఎఫెక్ట్స్ అన్న బిల్‌గేట్స్?)
అయితే ఆ దేశంలో ఇప్పుడు రెండో దశ వ్యాప్తి మొదలైంది. దీంతో ఆ దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉంది. పెద్ద సంఖ్యలో కేసులు నమోదవడం కలకలం రేపుతోంది. దీనిపై ఆ దేశంలో ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. అయితే ఈ కరోనా విషయంలో ఇద్దరి ఆగ్రహావేశాలు తట్టుకోలేక ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే కరోనా రోగి, ఓ చిన్నారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారికి ఆ అవకాశం కల్పించకపోవడంపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసనలకు తట్టుకోలేక వాటికి బాధ్యత వహిస్తూ ఖురేసుఖ్ ఉఖ్నా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ముఖ్యంగా మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్‌లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలతో పాటు నిరసనలు వచ్చాయి. ఈ విధంగా కరోనా వ్యాప్తి ప్రధానికి చుక్కలు చూపించింది.
(చదవండి: కరోనా కథలెన్నెన్నో..)
Comments
Please login to add a commentAdd a comment