బ్రిటన్ దేశస్తునికి వీడ్కోలు పలుకుతున్న క్వారంటైన్ అధికారులు
సాక్షి, అమరావతి: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి నివారణ చర్యలను చేపట్టడంతో పలువురు కరోనా బాధితులు సురక్షితంగా డిశ్చార్జ్ అవుతున్నారు. ల్యాబ్ సౌకర్యాల నుంచి ఐసోలేషన్ వార్డుల వరకూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి.. ఉత్తమ వైద్య సేవలతో కోలుకుని డిశ్చార్జి అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 35 మంది డిశ్చార్జ్ కాగా.. ఒక్క గురువారమే 15 మంది వరకూ ట్రీట్మెంట్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లారు.
అనంతపురంలో తల్లి,కుమారుడికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించడంతో వారు త్వరగా కోలుకుని గురువారం డిశ్చార్జ్ అయ్యారు. కడపలో ఒకే సారి 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొదటి విడతగా చేరిన పాజిటివ్ కేసులకు పూర్తి జాగ్రత్తలతో వైద్యం అందించారు. మరికొంత మంది 14 రోజులు క్వారంటైన్ పూర్తి చేసుకుని త్వరలోనే డిశ్చార్జ్ కాబోతున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి నిలయంలోని క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయిన బ్రిటన్ దేశస్తుడు ఏపీ ప్రభుత్వం సేవలు ఫైవ్ స్టార్ స్థాయిలో ఉన్నాయని కొనియాడారు. తమ ప్రాణాలకు తెగించి మరీ సిబ్బంది చేసిన సేవలు తాము జన్మలో మర్చిపోలేమని బాధితులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరో వైపు ప్రభుత్వం రోగులకు వైద్య సదుపాయాలు అందించడంలో పూర్తి అప్రమత్తతతో ముందుకెళ్తుంది. దీంతో రానున్న రోజుల్లో డిశ్చార్జ్ కేసుల సంఖ్య పెరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment