
సాక్షి, నెల్లూరు జిల్లా: కరోనా బాధితులకు మరిన్ని సేవలు అందిస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజుకు ఆరువేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని పేర్కొన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి సత్వరమే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. గూడూరు, నాయుడుపేటలో కరోనా పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. (కరోనా పరీక్షల్లో అగ్రస్ధానంలో ఏపీ)
కరోనా వస్తే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చికిత్స అందించేందుకు కోవిడ్ ఆసుపత్రుల్లో మరిన్ని అధునాతన సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. మీడియా కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment