
సాక్షి, హైదరాబాద్/ మంచిర్యాల : కరోనా లక్షణాలు లేవని గాంధీ ఆసుపత్రి నుంచి తిప్పి పంపిన మహిళ కరోనా కారణంగానే మృతి చెందారు. ఈనెల 14న హైదరాబాద్‌లో మృతిచెందిన మహిళకు కరోనా నిర్ధారణ అయింది. కరోనా అనుమానంతో చెన్నూరు మండలం ముత్తేరావుపల్లికి చెందిన మహిళ తొలుత మంచిర్యాలలో ఆస్పత్రిలో చేరారు.
అనంతరం మంచిర్యాల నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి మహిళను తరలించారు. అయితే కరోనా లక్షణాలు లేవని గాంధీ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈనెల 14న మహిళ మృతి చెందారు. మృతిచెందిన అనంతరం ఆమెకు కోరోనా పరీక్షలు జరపగా, ఈరోజు వచ్చిన రిపోర్టులో మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు లేకపోవటంతో గ్రీన్ జోన్‌గా మంచిర్యాల కొనసాగుతోంది. అదే ప్రాంతంలో కరోనాతో మహిళ మృతిచెందడంతో కలకలం రేగింది. మహిళ బందువులు, మంచిర్యాలలో మృతురాలికి ప్రాథమిక వైద్యం అందించిన వైద్యులు, వైద్య సిబ్బందిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment