సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. గాంధీ ఆస్పత్రిలో హెల్త్ వర్కర్ కృష్ణమ్మకు తొలి వ్యాక్సిన్ వేశారు. వ్యాక్సిన్ ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఈటల రాజేందర్ , సీఎస్ సోమేష్‌కుమార్ పరిశీలించారు. తిలక్‌నగర్ పీహెచ్‌సీలో వ్యాక్సినేషన్‌ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీకాలపై అపోహలు వద్దని తెలిపారు. ప్రతి మూడింట ఒక వ్యాక్సిన్ హైదరాబాద్‌లోనే తయారవుతుందన్నారు. వ్యాక్సిన్‌లో ప్రపంచానికి హైదరాబాద్ హబ్‌గా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి: తొలి టీకా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇలా..
నిమ్స్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, మనదేశంలో వ్యాక్సిన్ విడుదల కావడం చాలా గర్వంగా ఉందన్నారు.వ్యాక్సిన్ విషయంలో భయం ,ఆందోళన అవసరం లేదని, అన్ని పరీక్షల తరువాతే వ్యాక్సిన్ వచ్చిందని ఆమె తెలిపారు. భారత్ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రానుందన్నారు. చదవండి: టీకా.. ఆపై సిరా
వ్యాక్సినేషన్‌లో 50 వేలమంది సిబ్బంది పాల్గొంటారు. వ్యాక్సిన్ వేసేందుకు 10 వేలమంది వైద్యసిబ్బందికి ప్రత్యేకశిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం 1,213 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకాలు వేయాలని అధికారులు నిర్ణయించారు. తొలిరోజు కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 140 కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ వేస్తారు. ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున 4,200 మందికి టీకా వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment