గాంధీ ఆసుపత్రి వ్యవహారంపై ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో అక్రమాలపై బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రిలో పరిణామాలు, ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు