
సాక్షి, హైదరాబాద్ : కరోనా పరీక్షల నిమిత్తం వైద్యులు తీసుకెళ్లిన ఓ వ్యక్తి ఆచూకీ లభించడంలేదని హైదరాబాద్‌లోని ఓ పోలీస్ట్‌షన్‌లో కేసు నమోదు అయ్యింది. మంగల్‌ఘాట్ ఎస్‌ఐ రణ్‌వీర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన నరేందర్ సింగ్ అనే వ్యక్తిని మే 30న కింగ్‌కోఠీ ఆస్పత్రికి కొంతమంది వైద్యులు తీసుకునివెళ్లారు. కోవిడ్ లక్షాణాలు ఉన్నాయని అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిజానికి తనకు ఎలాంటి లక్షణాలు లేవు. చివరిసారిగా జూన్ 2న నరేందర్ వారి కుటుంబ సభ్యులతో ఫోన్‌లో ముచ్చటించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం అతని కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్‌ఐ తెలిపారు. (తెలంగాణలో కొత్తగా 237 కరోనా కేసులు)
మరోవైపు నరేందర్ సింగ్ ఆచూకీ కోసం అతడి తల్లీ, సోదరుడు కూడా గాలిస్తున్నారు. తమ కుమారుడు వివరాలను తెలపాలంటూ తల్లీ విలపిస్తున్నారు. ఇదిలావుండగా నరేందర్ గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు కూడా నమోదు కాలేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో అతను ఏమైపోయాడోనని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 15 రోజులుగా ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment