
సాక్షి, హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఓ వివాహిత వైద్యం అందక ప్రాణాలు విడిచింది. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. జ్వరంతో అనారోగ్యం పాలైన తన భార్య రోహిత ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయిందని ఆమె భర్త శ్రీకాంత్ ఆరోపించారు. బెడ్లు లేవని ఆస్పత్రుల యాజమాన్యాలు తిప్పి పంపించాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రోహితను కాపాడుకోవడం కోసం రాత్రంతా నగరంలోని ప్రముఖ ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఎవరూ కనికరించలేదని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రుల తీరు ప్రైవేటు కన్నా దారుణంగా ఉందని విమర్శించారు. చివరకు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా రోహిత బుధవారం చనిపోయిందని శ్రీకాంత్ తెలిపారు. సమయానికి వైద్యం అంది ఉంటే ఆమె ప్రాణాలు నిలిచేవని అన్నారు. ప్రభుత్వం, అధికారులు చెప్తున్నట్టు బయట పరిస్థితులు లేవని, అనారోగ్యం పాలైతే పట్టించుకునేవారు కరువయ్యారని చెప్పారు.
(చదవండి: తెలంగాణలో ఒక్క రోజే 499 కరోనా కేసులు)