
రహేజా మైండ్‌స్పేస్ బిల్డింగ్
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పర్యటించారు. కరోనా ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న అనుమానితుడిని వైద్యులతో కలిసి బుధవారం ఉదయం కలెక్టర్ పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉంది. కోవిడ్-19పై ప్రజలు ఆందోళ చెందాల్సిన అవసరం లేదు.
(చదవండి : తూర్పుగోదావరిలో కరోనా కలకలం!)
అనుమానిత వ్యక్తి నుంచి శాంపిల్స్ సేకరించి వైద్య పరీక్షలు నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి పంపించాం. రిపోర్టు వచ్చాకే అతనికి కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయం చెప్పగలం. అనుమానితుడు తిరిగిన ఇంటిని కూడా డొమెస్టిక్ ఐసోలేషన్‌లో పెట్టాం. కరోనా వైరస్‌పై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి బంధువులకు అవగాహన కల్పించాం. చికిత్సకు సంబంధించి అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాం’అని కలెక్టర్ పేర్కొన్నారు.
(చదవండి: కరోనా భయం : హోలీ వేడుకలపై పిటిషన్)
Comments
Please login to add a commentAdd a comment