
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో కరోనా వైరస్ కేసు కలకలం రేపింది. ఇటీవల ఇటలీ నుంచి మంచిర్యాల వచ్చిన యువకుడు దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. కరోనా వ్యాప్తిస్తోందన్న భయాందోళనల నడుమ.. అతని కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యలు కరోనా లక్షణాలు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం యువకుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్ మున్సిపాలిటీలోని నాగార్జున కాలనీకి చెందిన ఈ యువకుడు ఇటలీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటలీ కరోనా ఉధృతి విపరీతంగా ఉండటంతో 12 రోజలు క్రితం మంచిర్యాలకు చేరుకున్నాడు. అయితే అప్పటి నుంచే అతని ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. (మాల్స్, సినిమా హాల్స్ బంద్)
Comments
Please login to add a commentAdd a comment