ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రామవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు
Published Thu, Oct 20 2016 12:18 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రామవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొత్తగూడెం వైపు విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటో ముందు చక్రం ఊడిపోవడంతో ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరిలో మట్టపర్తి అక్షయ(6) అనే చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదసమయంలో ఆటోలో 9 మంది ఉన్నారు.
Advertisement
Advertisement