భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు గ్రామాలు శనివారం పోలీసులు–మావోయిస్టుల ఎదురుకాల్పులతో అట్టుడికాయి. గంటపాటు ఇరువర్గాల మధ్య హోరాహోరీగా సాగిన కాల్పులతో ఆదివాసీలు పరుగున ఇళ్లల్లోకి వెళ్లి ప్రాణాలను దక్కించుకున్నారు. పలు ఇళ్ల పైకప్పులకు తూటాలు తగిలి సిమెంటు రేకులు, పెంకులు పగిలాయి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎస్టీఎఫ్, డీఆర్జీ, సీఆర్పీఎఫ్ బలగాలు శనివారం తోగ్గూడెం– చర్ల మండలం తిప్పాపు రం గ్రామాల మధ్య వేసిన రోడ్డును తనిఖీ చేస్తున్నాయి.