
సాక్షి, కొత్తగూడెం: ‘కొడుకు, కోడలు నమ్మించి నా ఇల్లు రాయించుకున్నారు. సూటిపోటి మాటలతో నిత్యం నరకం చూపిస్తున్నారు. వారితో నాకు ప్రాణభయం ఉంది. రక్షణ కల్పించండి’ అంటూ ఓ వృద్ధురాలు సోమ వారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యూగొల్లగూడెంకు చెందిన పెంటి భూలక్ష్మికి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అందరికి పెళ్లిళ్లు చేసింది. మూడో కొడుకు, కోడలు సత్యనారాయణ– మాధవి మాయమాటలు చెప్పి తన పేర ఉ న్న ఇల్లును సొంత చేసుకున్నారని, ఆపై మానసికంగా వేధిస్తున్నారని ఆమె వాపో యింది. ‘అయినా ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడంతో కొట్టి మరీ గెంటేశారు. మిగిలిన కొడుకుల దగ్గరికి వెళ్లినా అవే ఛీదరింపులు. తమకు తెలియకుండా మూడో కొడుకు కు ఇల్లు ఎందుకు రాశావనే కోపంతో వారు కూడా పట్టించుకోవట్లేదు. దీంతో కొత్తగూడెంలో ఉన్న కూతురు, తమ్ముడి వద్ద ఆశ్రయం పొందుతున్నా. కొడుకు, కోడలుతో ప్రాణాపాయం ఉంది. రక్షణ కల్పించడంతోపాటు నా ఇల్లు నాకు ఇప్పించండి’ అంటూ భూలక్ష్మి సోమవారం అదనపు కలెక్టర్ అనుదీప్‌ను కలసి తన గోడు వెళ్లబోసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment