మణుగూరుటౌన్(భద్రాద్రి కొత్తగూడెం): సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మోటర్ వెహికిల్ డ్రైవింగ్ శిక్షణ తరగతులను సమితి అధ్యక్షురాలు ఉమా నర్సింహారావు మంగళవారం ప్రారంభించారు. మణుగూరు ఏరియాలోని పీవీ కాలని భద్రాద్రి స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు మాట్లాడుతూ సింగరేణి నిర్వాసిత కుటుంబాల నిరుద్యోగులకు ఉచిత శిక్షణతో పాటు, లైట్ మోటర్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తామన్నారు.
అందుకోసం 40 మంది యువకులను ఎంపిక చేస్తామని, రెండు గ్రూపులుగా చేసి నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు. ఏరియా పర్సనల్ మేనేజర్ రేవు సీతారాం, సంక్షేమ అధికారులు సింగు శ్రీనివాస్, రామేశ్వర్, సేవా సమితి సభ్యురాలు షాకీరా, స్పోర్ట్స్ సూపర్ వైజర్ జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.
డ్రైవింగ్ శిక్షణ తరగతులు ప్రారంభం
Published Wed, Mar 21 2018 3:32 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement