దీపం అంటుకొని దంపతుల మృతి
కొత్తగూడెం: దేవుని విగ్రహాల ముందు ముట్టించిన దీపం అంటుకుని జరిగిన ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన పోశాలు(58), వెంకమ్మ(54) దంపతులు పెట్రోల్, కిరోసిన్ విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఈ నెల 12న ఇంట్లో వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు కిరోసిన్ పై పడి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వెంకమ్మ అక్కడికక్కడే మృతి చెందగా...పోశాలుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం ఆయన మృతి చెందాడు. అగ్నిప్రమాదంలో దంపతుల మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.