భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీ, గిరిజనులు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. హరితహారం పేరున ఆదివాసీ, గిరిజన పేదల భూములు గుంజుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈ భారీ ర్యాలీ నిర్వహించారు. పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని, రైతులపై అక్రమంగా బనాయించిన కేసులు రద్దు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. అలాగే 10 వేల రూపాయల ఆర్దిక సాయం అందించి, గిరిజన, దళిత కుటుంబాలకు భూమి పంచాలని కోరారు.