బíహిరంగ మార్కెట్లో మాంసం అమ్మకాలు
రామారావు ఓ చిరుద్యోగి.. జీతం రాగానే అటు నుంచి అటుగా మాంసం షాపుకెళ్లి కిలో మటన్ కొనుగోలు చేసి ఇటికి తీసుకెళ్లాడు. దాన్ని ఆయన భార్య కుక్కర్లో పెట్టి గంట వరకు ఉడికించింది. అయినా ఉడక లేదు. మళ్లీ ఉడికించింది. ఎలాగో అలా తినేశారు. ఒక గంట తరువాత రామారావుకు కడుపునొప్పితో విరేచనాలు పట్టుకున్నాయి.
వెంటనే ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్ అతన్ని పరీక్షించి అపరిశుభ్రమైన మాంసాన్ని తినడం వలనే ఇలా జరిగిందని చెప్పాడు. ఇంకేముంది వెయ్యి రూపాయల వరకు వదిలాయి. ఇది ఒక్కరామారావు మాత్రమే ఎదుర్కొన్న సమస్య కాదు. నిత్యం అనేక మంది మాంసం ప్రియులు ఎదుర్కొంటున్న సమస్య...
చుంచుపల్లి కొత్తగూడెం : ముక్క లేనిదే ముద్ద దిగని రోజులివి.. వారాలతో పని లేకుండా నిత్యం మాంసాహారానికే జనం మొగ్గుచూపుతున్నారు. దీంతో పట్టణా ల్లో ఎక్కడ చూసినా ఫుట్‌పాత్‌లు, ఫాస్ట్‌పుడ్ సెం టర్లు, హోటళ్లు నిత్యం ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. మారుతున్న పరిస్థితులు, ప్రజల ఆహారపు అలవాట్ల నేపధ్యంలో మనం తింటున్న మాంసాహారం ఎంతవరకు సురక్షితం..! అని లోతుగా ఆరా తీస్తే ఆందోళన కలిగిం చే విషయాలు వెలుగుచూస్తున్నాయి.
వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొంద రు వ్యాపారులు జిల్లాలో ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలను జరుపుతున్నారు. మరికొంత మంది వ్యాపారులైతే రోగాల భారిపడి చనిపోయే దశలో ఉన్న జీవాలను సైతం వదలడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వాటి మాంసాన్ని కూడా అంటగడుతున్నారు. ఆదివారం రోజున వ్యాపారుల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. తాము అమ్మిందే మాంసం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.
జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటుగా జిల్లా కేంద్రం కొత్తగూడెం లోనూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇక్కడ వ్యా పారులు దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నా రు. మార్కెట్లు, బజార్లలో అమ్మకాలు జరిపే మాం సం సెంటర్లలో రోగాల బారినపడిన బక్క మేక లు, గొర్రెల దట్యాలకు ఏకంగా మేకపోతు తోకలను అతికించి జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అపరిశుభ్రమైన, రోగాల బారిపడిన మాంసం భుజించడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కొంత కాలంగా ఇలాంటి అమ్మకాలు పట్టణాల్లో జోరుగా సాగుతున్నాయి.
పర్యవేక్షించని పశువైద్యాధికారులు..
జీవాలను వధించే దగ్గర నుంచి విక్రయించే వరకు పర్యవేక్షించాల్సిన సంబంధిత పశువైద్యాధికారు లు అటువైపుగా తొంగిచూసిన దాఖలాలు లేవని విమర్శలున్నాయి.
పట్టణాల్లో యథేచ్ఛగా అమ్మకాలు..
జిల్లాలో మాంసం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న, చనిపోయిన జీవాలను చౌకగా కొనుగోలు చేసి వాటిని కోసి విక్రయిస్తున్నారు.
జిల్లాలో 397 మాంసం దుకాణాలు
జిల్లా వ్యాప్తంగా సుమారు 397 మటన్ దుకాణా లున్నాయి. ప్రధానంగా పట్టణాలలో వీటి సంఖ్య అధికంగా ఉంది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటుగా ఒక మోస్తరు పెద్ద గ్రామాల్లో మటన్ షాపులున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కిలో మటన్ రూ.440 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.400 పలుకుతుంది. జిల్లాలో రోజుకు 80 క్వింటాళ్ల వరకు మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి. ఇక ఆదివారమైతే ఏకంగా వంద క్విం టాళ్లకు పైగానే మాంసం విక్రయాలు జరుగుతా యి.
పట్టణాల్లో మటన్‌ను రిటేల్‌గా అమ్మే వ్యా పారులు గ్రామీణ ప్రాంతాలు, సంతల్లో తిరిగి అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను కొనుగో లు చేస్తుంటారు. వాటిని ఆది, బుధ వారాల్లో తమ ఇంట్లో వధించి అనంతరం షాపుల్లో పెట్టి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రధానంగా పట్టణాలైన కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, పాల్వంచలో జరుగుతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
తూకంలోనూ మోసాలు..
మరో వైపు మటన్ అమ్మే తూకంలోనూ వ్యా పారులు మోసాలకు పాల్పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న మేకల, గొర్రెలను కోసి అమ్మడం ద్వారా ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని విమర్శలొస్తున్నాయి.
పట్టించుకోని, పంచాయతీ, మున్సిపల్ అధికారులు..
మాంసం విక్రయాల విషయంలో పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం మూలంగానే వ్యాపారుల ఆగడాలు పెరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిజానికి మున్సిపాలిటీ, పంచాయతీ స్థాయిలో మాంసం విక్రయాలపై పర్యవేక్షణ ఉండాలి.
ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహించాలి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశు వధశాలలున్నా కానీ అక్కడ ఎవరూ గొర్రెలు, మేకలను వధించిన దాఖలాలు లేవు. పశు వైద్యాధికారులు ధ్రువీకరించాకే ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలను పశువధశాలలో కోయాల్సి ఉంటుంది. మార్కెట్లో ఏ మాంసాన్ని అమ్ముతున్నారో ఎవరికీ అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి.
చర్యలు తీసుకుంటాం
మాంసం అమ్మకాలకు కోసే జీవాలను వ్యాపారులు బాధ్యతగా పశువధశాలలకు తీసుకురావాలి. దీని విషయంలో గతంలో నోటీసులు ఇచ్చినా మార్పు రాలేదు. మళ్లీ నోటీసులు జారీ చేస్తాం. నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. మాంసం వ్యాపారులు ఆహార కల్తీ నిరోధక చట్టానికి లోబడి విక్రయాలు చేయాలి. అపరిశుభ్రమైన వాతావరణం, రోగాలపాలైన జీవాల మాంసం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రవికుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్, కొత్తగూడెం
Comments
Please login to add a commentAdd a comment