sheeps dies
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కోరుట్ల రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 63వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం 6.30కి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే ఘటనలో 94 సబ్సిడీ గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని తాడ్వాయి నుంచి కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లలితాపూర్‌కు ఏడు యూనిట్ల (147) సబ్సిడీ గొర్రెలను డీసీఎం వ్యానులో తరలిస్తున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ నుంచి మహారాష్ట్ర వైపు గ్రానైట్‌లోడ్‌తో వెళ్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ మోహన్‌రావు పేట శివారులో డీసీఎంను బలంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా వ్యాన్ వెనక వస్తున్న ఓ సైకిల్, ద్విచక్రవాహ నాన్ని ఢీకొంది. ఘటనలో ద్విచక్రవాహనంపై వస్తున్న వెంకటాపూర్‌కి చెందిన దుర్గం బాలాగౌడ్ (60), కోరుట్లకు చెందిన అబ్దుల్ ఖాదర్ (41) అక్కడికక్కడే మృతిచెందారు. లారీ బలంగా ఢీకొనడంతో డీసీఎంలో ఉన్న 94 సబ్సిడీ గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వ్యానులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. లారీ డ్రైవర్ తీవ్రం గా గాయపడడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. ఎస్పీ సునీల్‌దత్, మెట్పల్లి డీఎస్పీ మల్లారెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఎస్సై మధుకర్ సంఘటన వివరాలు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్పందించిన 1962 ప్రమాదంలో 94 గొర్రెలు మృతిచెందగా మిగిలిన గొర్రెలకు గాయాలయ్యాయి. గాయపడ్డ గొర్రెలకు జగిత్యాల జిల్లాకు చెందిన మొబైల్ వెటర్నరీ క్లినిక్ (1962) వాహనం సమయానికి చేరుకుని వైద్యం అందించింది. అనంతరం వాటిని మానకొండూరుకు పంపినట్లు టీం మెంబర్లు అన్వేష్, గంగాధర్ తెలిపారు. -
జీవాలపైకి దూసుకెళ్లిన లారీ
బిజినేపల్లి రూరల్(నాగర్‌కర్నూల్) : రోడ్డు పక్కన వెళ్తున్న గొర్రెలను ఓ లారీ నలిపేసింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని పాలెం వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు... మంగనూర్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు శివయ్య, మాసయ్య, శ్రీను, పర్వతాలుకు ప్రభుత్వం సబ్సిడీ గొర్రెలను అందజేసింది. స్థానికంగా మేత లేకపోవడంతో నల్లమల అటవీ ప్రాంతంలో గొర్రెలు మేపుకోవాలని నలుగురు గ్రామం నుంచి సోమవారం బయల్దేరారు. మంగళవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో పాలెం సమీపంలో వెళ్తుండగా, ఓ లారీ మందపైకి దూసుకొచ్చింది. దీంతో మందలోని 29 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ఈ సంఘటనపై కాపరుల ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు కావడంతో పశువైద్యాధికారులు అక్కడికి చేరుకుని, వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కాపరులు వేడుకున్నారు. గొర్రెల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కాపరులను పరామర్శించిన ఎమ్మెల్యే విషయం తెలియడంతో స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాపరులకు రూ.15వేల ఆర్థిక సాయం అంది ంచా రు. ప్రభుత్వం నుంచి బీమా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్.శ్రీను సంఘటనా స్థలంలో గొర్రెల కాపరులతో మాట్లాడారు. కాపరులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ రాములు, పశువైద్య అధికారి బుచ్చమ్మ, ఎంపీటీసీ మనోహర్, మాజీ ఎంపీపీ బాలీశ్వర్, జాలం నాగయ్య, టీఆర్ఎస్ నాయకులు కిరణ్, బాలస్వామి, ఎల్లస్వామి, తిరుమల్‌యాదవ్, జగదీశ్వర్‌రెడ్డి ఉన్నారు. -
మాంసం ప్రియులారా జర జాగ్రత్త..
రామారావు ఓ చిరుద్యోగి.. జీతం రాగానే అటు నుంచి అటుగా మాంసం షాపుకెళ్లి కిలో మటన్ కొనుగోలు చేసి ఇటికి తీసుకెళ్లాడు. దాన్ని ఆయన భార్య కుక్కర్లో పెట్టి గంట వరకు ఉడికించింది. అయినా ఉడక లేదు. మళ్లీ ఉడికించింది. ఎలాగో అలా తినేశారు. ఒక గంట తరువాత రామారావుకు కడుపునొప్పితో విరేచనాలు పట్టుకున్నాయి. వెంటనే ఆసుపత్రిలో చేరాడు. డాక్టర్ అతన్ని పరీక్షించి అపరిశుభ్రమైన మాంసాన్ని తినడం వలనే ఇలా జరిగిందని చెప్పాడు. ఇంకేముంది వెయ్యి రూపాయల వరకు వదిలాయి. ఇది ఒక్కరామారావు మాత్రమే ఎదుర్కొన్న సమస్య కాదు. నిత్యం అనేక మంది మాంసం ప్రియులు ఎదుర్కొంటున్న సమస్య... చుంచుపల్లి కొత్తగూడెం : ముక్క లేనిదే ముద్ద దిగని రోజులివి.. వారాలతో పని లేకుండా నిత్యం మాంసాహారానికే జనం మొగ్గుచూపుతున్నారు. దీంతో పట్టణా ల్లో ఎక్కడ చూసినా ఫుట్‌పాత్‌లు, ఫాస్ట్‌పుడ్ సెం టర్లు, హోటళ్లు నిత్యం ఆహార ప్రియులతో కిటకిటలాడుతుంటాయి. మారుతున్న పరిస్థితులు, ప్రజల ఆహారపు అలవాట్ల నేపధ్యంలో మనం తింటున్న మాంసాహారం ఎంతవరకు సురక్షితం..! అని లోతుగా ఆరా తీస్తే ఆందోళన కలిగిం చే విషయాలు వెలుగుచూస్తున్నాయి. వినియోగదారుల అవసరాలను ఆసరాగా చేసుకొని కొంద రు వ్యాపారులు జిల్లాలో ఇష్టారాజ్యంగా మాంసం విక్రయాలను జరుపుతున్నారు. మరికొంత మంది వ్యాపారులైతే రోగాల భారిపడి చనిపోయే దశలో ఉన్న జీవాలను సైతం వదలడం లేదు. కొన్ని ప్రాంతాల్లో చనిపోయిన వాటి మాంసాన్ని కూడా అంటగడుతున్నారు. ఆదివారం రోజున వ్యాపారుల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. తాము అమ్మిందే మాంసం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటుగా జిల్లా కేంద్రం కొత్తగూడెం లోనూ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇక్కడ వ్యా పారులు దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నా రు. మార్కెట్లు, బజార్లలో అమ్మకాలు జరిపే మాం సం సెంటర్లలో రోగాల బారినపడిన బక్క మేక లు, గొర్రెల దట్యాలకు ఏకంగా మేకపోతు తోకలను అతికించి జోరుగా అమ్మకాలు జరుపుతున్నారు. అపరిశుభ్రమైన, రోగాల బారిపడిన మాంసం భుజించడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కొంత కాలంగా ఇలాంటి అమ్మకాలు పట్టణాల్లో జోరుగా సాగుతున్నాయి. పర్యవేక్షించని పశువైద్యాధికారులు.. జీవాలను వధించే దగ్గర నుంచి విక్రయించే వరకు పర్యవేక్షించాల్సిన సంబంధిత పశువైద్యాధికారు లు అటువైపుగా తొంగిచూసిన దాఖలాలు లేవని విమర్శలున్నాయి. పట్టణాల్లో యథేచ్ఛగా అమ్మకాలు.. జిల్లాలో మాంసం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న, చనిపోయిన జీవాలను చౌకగా కొనుగోలు చేసి వాటిని కోసి విక్రయిస్తున్నారు. జిల్లాలో 397 మాంసం దుకాణాలు జిల్లా వ్యాప్తంగా సుమారు 397 మటన్ దుకాణా లున్నాయి. ప్రధానంగా పట్టణాలలో వీటి సంఖ్య అధికంగా ఉంది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటుగా ఒక మోస్తరు పెద్ద గ్రామాల్లో మటన్ షాపులున్నాయి. పట్టణ ప్రాంతాల్లో కిలో మటన్ రూ.440 ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో కిలో రూ.400 పలుకుతుంది. జిల్లాలో రోజుకు 80 క్వింటాళ్ల వరకు మాంసం అమ్మకాలు జరుగుతుంటాయి. ఇక ఆదివారమైతే ఏకంగా వంద క్విం టాళ్లకు పైగానే మాంసం విక్రయాలు జరుగుతా యి. పట్టణాల్లో మటన్‌ను రిటేల్‌గా అమ్మే వ్యా పారులు గ్రామీణ ప్రాంతాలు, సంతల్లో తిరిగి అనారోగ్యంతో ఉన్న గొర్రెలు, మేకలను కొనుగో లు చేస్తుంటారు. వాటిని ఆది, బుధ వారాల్లో తమ ఇంట్లో వధించి అనంతరం షాపుల్లో పెట్టి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రధానంగా పట్టణాలైన కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, పాల్వంచలో జరుగుతుంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తూకంలోనూ మోసాలు.. మరో వైపు మటన్ అమ్మే తూకంలోనూ వ్యా పారులు మోసాలకు పాల్పడుతున్నారు. అనారోగ్యంతో ఉన్న మేకల, గొర్రెలను కోసి అమ్మడం ద్వారా ప్రజారోగ్యంతో చెలగాటమాడటమేనని విమర్శలొస్తున్నాయి. పట్టించుకోని, పంచాయతీ, మున్సిపల్ అధికారులు.. మాంసం విక్రయాల విషయంలో పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం మూలంగానే వ్యాపారుల ఆగడాలు పెరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. నిజానికి మున్సిపాలిటీ, పంచాయతీ స్థాయిలో మాంసం విక్రయాలపై పర్యవేక్షణ ఉండాలి. ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు నిర్వహించాలి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పశు వధశాలలున్నా కానీ అక్కడ ఎవరూ గొర్రెలు, మేకలను వధించిన దాఖలాలు లేవు. పశు వైద్యాధికారులు ధ్రువీకరించాకే ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు, మేకలను పశువధశాలలో కోయాల్సి ఉంటుంది. మార్కెట్లో ఏ మాంసాన్ని అమ్ముతున్నారో ఎవరికీ అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. చర్యలు తీసుకుంటాం మాంసం అమ్మకాలకు కోసే జీవాలను వ్యాపారులు బాధ్యతగా పశువధశాలలకు తీసుకురావాలి. దీని విషయంలో గతంలో నోటీసులు ఇచ్చినా మార్పు రాలేదు. మళ్లీ నోటీసులు జారీ చేస్తాం. నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకుంటాం. మాంసం వ్యాపారులు ఆహార కల్తీ నిరోధక చట్టానికి లోబడి విక్రయాలు చేయాలి. అపరిశుభ్రమైన వాతావరణం, రోగాలపాలైన జీవాల మాంసం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. రవికుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్, కొత్తగూడెం -
గొర్రెలకు ఏదీ బీమా ధీమా..!
ఇతడి పేరు అల్వాల నాగరాజు(40). సిరిసిల్ల పట్టణ శివారులోని మార్కట్‌పల్లెకు చెందిన ఇతను వ్యవసాయం చేసేవాడు. కులవృత్తిగా వచ్చిన గొర్రెలు కాస్తూ జీవనం సాగించాడు. రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రాయితీతో గొర్రెలు ఇస్తుందని సంతోషపడ్డాడు. యాదవ సంఘం సమక్షంలో డ్రా తీయగా నాగరాజు పేరు వచ్చింది. గొర్రెల కోసం రూ.31,250 డీడీ కట్టాడు. 20 గొర్రెలు, ఒక పొట్టేలు వస్తుందని ఆశతో కడపకు వెళ్లాడు. 12 గొర్రెలు, 9 పిల్లలు వచ్చాయి. వచ్చిన పదిహేను రోజులకే పుర్రుకొడుతూ ఐదు గొర్రెలు చనిపోయాయి. రూ.4వేలు మందులు వేసినా గొర్రెలు దక్కలేదు. మరో వారం రోజులకు ఆరు చిన్నవి, నాలుగు పెద్దవి కూడా మృత్యువాత పడ్డాయి. ఇక చిన్నాపెద్ద గొర్రెలు అన్నీ కలిపి 11 మిగిలాయి. పది గొర్రెలు చనిపోయి నాలుగు నెలలు అవుతున్నా.. నాగరాజుకు ఒక్క పైసా పరిహారం రాలేదు. ఇది ఒక్క నాగరాజు పరిస్థితే కాదు.. జిల్లాలోని 446 మంది గొర్రెలకాపరుల దుస్థితి ఇదే.. సిరిసిల్ల : గొర్రెలకాపరులకు 75 శాతం సబ్సిడీతో నేరుగా ఒక్కొక్కరికి 21 గొర్రెలు అందజేసింది. ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షలు కాగా ఇందులో 25 శాతం.. అంటే రూ.31250 లబ్ధిదారు చెల్లిస్తే.. రూ.93,750 ప్రభుత్వం భరించింది. గొర్రెలకు బీమా, రవాణా ఖర్చులు సైతం ఇందులోనే ఉండేలా పథకం రూ పొందించారు. వీటిని బ్యాంకులతో సంబం ధం లేకుండానే నేరుగా పంపిణీ చేశారు. గొర్రెలకాపరులకు ధీమా ఇవ్వాలనే లక్ష్యంతో గొర్రెలకు బీమా చేయించారు. 20 గొర్రెలు, ఒక్క పొట్టేలుకు బీమా కంపెనీకి చెందిన ట్యాగ్స్(పోగులు) వేశారు. అన్ని గొర్రెలకు కలిపి యూని ట్‌గా బీమా ప్రీమియంగా బీమా కంపెనీకి రూ.3,240 చెల్లించారు. ఏడాదిలోగా ఆ యూ నిట్‌లోని ఏ గొర్రె చనిపోయినా రూ.5,200, పొట్టేలు చనిపోతే రూ.7,000 పరిహారంగా గొర్రెలకాపరికి అందించాల్సి ఉంది. కానీ జిల్లాలోని 446 మంది గొర్రెల కాపరులకు చెందిన 2,161 గొర్రెలు మరణించగా.. ఒక్కరికి కూడా పరిహారం రాలేదు. బీమా..ధీమా దక్కలేదు. జిల్లాలో 2161 గొర్రెలు వివిధ కారణాలతో మరణించగా.. ఇప్పటి వరకు 577 గొర్రెలకు సంబంధించిన బీమా పత్రాలు(డాకెట్స్) కంపెనీకి చేరాయి. అందులో 524 గొర్రెలకు బీమా చెల్లిస్తామని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. మరో 53 గొర్రెల డాకెట్స్ సరిగా లేవని తిరస్కరించారు. ఇంకా 1,584 గొర్రెల బీమాపత్రాలు సమర్పించలేదు. వాటికి సంబంధించిన ఆనవాళ్లు కరువయ్యాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గొర్రెలకాపరులకు నష్టం తప్పడం లేదు. కారణాలేమిటీ..? ప్రతీగొర్రెను సజీవంగా ఉండగానే ట్యాగ్‌తో సహా ఫొటో తీయాల్సి ఉంటుంది. ఆ గొర్రె చ నిపోయినప్పుడు ఆ సమాచారాన్ని సంబంధిత మండల పశువైద్యాధికారికి సమాచారం అం దించాలి. ఆయన క్షేత్రస్థాయిలో చనిపోయిన గొర్రెను చూసి పోస్టుమార్టం నిర్వహించి మృ తికి గల కారణాలను విశ్లేషిస్తూ.. డాక్టర్ నివేదిక ఇవ్వాలి. చనిపోయిన గొర్రెను ట్యాగ్ కని పించే విధంగా ఒక్కటి, మొత్తం గొర్రెతో మరో టి, ట్యాగ్ నంబరు కనిపించే విధంగా మూడు ఫొటోలు తీయాలి. ఈ ఫొటో ప్రింట్లు, డాక్టర్ పోస్టుమార్టం నివేదికతో కలిపి బీమా కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. కంపెనీకి అన్ని పత్రాలు సవ్యంగా ఉన్నట్లు చేరితో మూడు నెలల్లో పరిహారం చెక్కు లేదా, డీడీ రూపంలో గొర్రెలకాపరికి బ్యాంకు ఖాతాకు చేరుతుంది. ఈ మొత్తం విధానంపై అవగాహన లేకపోవడంతో చనిపోయిన గొర్రెలను పాత బావుల్లో పడేయడం, లేదా పూడ్చివేశారు. దీంతో ఆనవాళ్లు కనిపించక బీమా కంపెనీలు పరిహారం ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. దీనిపై అవగాహన కల్పించాల్సిన పశువైద్యాధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో రూ.85.12 లక్షల నష్టం జిల్లావ్యాప్తంగా 212 గ్రామాల్లో తొలివిడత 8,153 మందికి 1,71,213 గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 6,931 మందికి 1,45,551 గొర్రెలను పంపిణీ చేశారు. దీని కోసం ప్రభుత్వం రూ.64.97 కోట్లు వెచ్చించింది. గొర్రెలకాపరులు వాటా ధనంగా రూ.21.65 కోట్లు చెల్లించాలి. చనిపోయిన గొర్రెల మూలంగా రూ.85.12 లక్షలు నష్టపోయారు. బీమా కంపెనీ నిర్ధారించిన 524 గొర్రెలకు రూ.27.24 లక్షల పరిహారం వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకైతే ఒక్క క్లెయిమ్ చెల్లింపులు జరగలేదు. బీమా పరిహారం ఇప్పిస్తాం జిల్లాకు సరఫరా అయిన గొర్రెలకు బీమా చేయించాం. చనిపోయిన వాటికి పరిహారం ఇప్పించేందుకు బీమా కంపెనీతో మాట్లాడుతున్నాం. నిర్దేశిత డాకెట్లను పంపిస్తాం. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలకు ఇక్కడికి వచ్చాక 30,608 గొర్రెల పిల్లలు పుట్టాయి. మనజిల్లా వీటి సంపద పెరిగినట్లే. కాపరులు గొర్రె చనిపోతే వెంటనే సమాచారం ఇవ్వాలి. వారు నష్టపోకుండా పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ టీవీ రమణమూర్తి, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి -
‘రీ సైక్లింగ్’లో విషాదం
ఇటిక్యాల (అలంపూర్): రాష్ట్ర ప్రభుత్వం గొల్ల, కుర్మల ఆర్థికాభివృద్ధి కోసం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం రోజురోజుకూ మరింతగా పక్కదారిపడుతోంది. దీనిపై పెద్దఎత్తున వార్తలు వెలువడుతున్నా.. మంత్రులస్థాయిలో హెచ్చరికలు వచ్చినా, అవకతవకలకు పాల్పడిన కొందరిపై చర్యలు చేపట్టినా.. ‘రీసైక్లింగ్’ జరుగుతూనే ఉంది. దళారులు ఈ గొర్రెలను పక్క రాష్ట్రాలకు తరలిస్తుండగా వాటినే తిరిగి సేకరణ పేరిట కొత్త లబ్ధిదారుల చెంతకు చేరుస్తున్నారు. ఇలా రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు గొర్రెలను తరలిస్తున్న వ్యాన్ శుక్రవారం బోల్తాపడి 79 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వాటి చెవులకున్న ట్యాగ్‌లను తొల గించినట్లుగా రంధ్రాలుండటంతో ‘రీసైక్లింగ్’ గొర్రెలుగా గుర్తించారు. పట్టుబడకుండా తెల్లవారుజామున: గురువారం అర్ధరాత్రి దాటిన అనంతరం సూర్యాపేట జిల్లా సిద్దిసముద్రం తండా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు ఓ డీసీఎం వ్యాన్‌లో 139 సబ్సిడీ గొర్రెలను తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ రవి నిద్రమత్తులో ఉండడంతో.. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం జింకలపల్లి స్టేజీ వద్ద వ్యాన్ అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వ్యాన్ డ్రైవర్ రవితోపాటు రఘునాయక్, రాముడు అనే వ్యక్తులకు గాయాలయ్యాయి. వ్యాన్‌లోని 79 గొర్రెలు చనిపోయాయి. మిగతావాటికి గాయాలయ్యాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడిన డ్రైవర్ రవి, రఘునాయక్, రాముడులను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. గొర్రెల విషయంపై పశువైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇటిక్యాల పశువైద్యాధికారి భువనేశ్వరి, ధర్మవరం పశువైద్య సబ్ సెంటర్ వైద్యుడు రాజేశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని గొర్రెలను పరిశీలించారు. చనిపోయినవాటిని పూడ్చి పెట్టించి, బతికున్న వాటిని స్థానిక వీఆర్ఏలకు అప్పగించారు. అయితే ఈ గొర్రెలన్నీ సబ్సిడీపై అందజేసినవేనని, రీసైక్లింగ్ కోసమే అనంతపురం జిల్లాకు తరలిస్తున్నారని పశువైద్యులు, పోలీసులు భావిస్తున్నారు. ప్రతీ గొర్రె చెవికి ట్యాగ్ వేసిన గుర్తులు (రంధ్రాలు) ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో సబ్సిడీపై లబ్ధిదారులకు అందజేసిన సబ్సిడీ గొర్రెలను.. వాటి చెవులకు వేసిన ట్యాగ్‌లను తొలగించి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. -
గొర్రెల మందపైకి దూసుకెళ్లిన టిప్పర్
శింగనమల: బుక్కరాయసముద్రం మండలంలోని సెంట్రల్‌జైలు సమీపంలో తాడిపత్రి రహదారిపై భద్రంపల్లి క్రాస్ వద్ద శుక్రవారం గొర్రెల మందపై టిప్పర్ దూసుకెళ్లింది. పది గొర్రెలు మృతి చెందగా.. మరో ఎనిమిది గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. టిప్పర్ అతి వేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవరు టిప్పరు నిలిపి పరారయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ సుధాకర్‌యాదవ్ తెలిపారు.