తహసీల్దార్ కార్యాలయం మెట్లపై పడుకుని ఆందోళన చేస్తున్న రైతు మిడియం సింగయ్య
మణుగూరు టౌన్: భూమి పట్టా పాస్‌పుస్తకం కోసం ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మల్లారం రెవె న్యూ గనిబోయినగుంపు సమీపంలో తన కు 5.03 గుంటల భూమి ఉందని, పట్టా దారు పాసుపుస్తకం కోసం ఐదేళ్లుగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడంలేదని మిడి యం సింగయ్య అనే రైతు తెలిపాడు.
చదవండి: ఎమ్మెల్యేల తీరుతో పార్టీకి తలనొప్పి..
అంతేకాకుండా తన అధీనంలో ఉన్న భూమిని ములుగు జిల్లా అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన పింగాళి చినరాజు పేరిట పట్టా చేశారని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సింగయ్య బుధవారం తహసీ ల్దార్ కార్యాలయం మెట్లపై పడుకుని నిరసన తెలిపాడు. పాస్‌పుస్తకం ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చోగా.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ధరణిలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో సింగయ్య ఆందోళన విరమించాడు.
చదవండి: టాప్‌టెన్‌లో ఏపీ విద్యార్థుల హవా
Comments
Please login to add a commentAdd a comment