మణుగూరు : అధికారం ఉంది కదా అనే అహంకారంతో ఓ ఎస్సై రెచ్చిపోయాడు. భార్య తన తప్పును ఎత్తిచూపడంతో సహించలేక వీరంగం సృష్టించాడు. భార్య, అత్తపై విచక్షణా రహితంగా దాడి చేసి మృగంలా ప్రవర్తించాడు. బాధితులు తెలిపిన వివరాలు... పాల్వంచకు చెందిన పర్వీన్, మణుగూరు ఎస్సై జితేందర్, 2015 ఖమ్మంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. అయితే ఏడాది నుంచి ఆమెను కాపురానికి తీసుకెళ్లేందుకు నిరాకరిస్తున్నాడు.
ఇదే విషయం అడిగేందుకని పర్వీన్, ఆమె తల్లి... మహిళాసంఘాల నాయకులు, బంధువులతో కలిసి మణుగూరు పీవీ కాలనీ సీ–టైప్‌లోని ఎస్సై ఇంటికి వచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన ఎస్సై జితేందర్ భార్య, అత్తపై దాడి చేశారు. ఈ ఘటనలో పర్వీన్ తీవ్రంగా గాయపడ్డారు. ‘ఎస్సై జితేందర్, వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందుకే పర్వీన్‌ను కాపురానికి తీసుకెళ్లడం లేదు. పైగా, ‘నువ్వు రావద్దు, నాకు విడాకులు ఇవ్వు’ అని తరచూ వేధిస్తున్నాడంటూ’’ పర్వీన్ బంధువులు ఆరోపించారు. ఈ దాడిపై, మణుగూరు పోలీస్ స్టేషన్‌లో పర్వీన్ పిర్యాదు చేశారు.
సీఐ వివరణ..
ఈ ఘటనపై మణుగూరు సీఐ కోండ్ర శ్రీనును ‘సాక్షి’ వివరణ కోరగా... బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడతామని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Published Thu, Aug 30 2018 9:06 PM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment