ఖమ్మం జిల్లాలో మణుగూరు సమీపంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 2 యూనిట్లు ఏర్పాటు కానున్నా యి.
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మణుగూరు సమీపంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో 2 యూనిట్లు ఏర్పాటు కానున్నా యి. ఈ మేరకు టీ జెన్‌కో ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇప్పటికే మణుగూరు ఏడూళ్ల బయ్యారం ప్రాంతంలో 270 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు కలిపి 1,080 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణ బాధ్యతలను బీహెచ్‌ఈఎల్(భెల్)కు ప్రభుత్వం అప్పగించింది. ఈ ప్రాంతానికి సమీపంలోనే మరోచోట 800 మెగావాట్ల 2 యూని ట్లను మొత్తం 1,600 మెగావాట్ల ప్లాంట్లను నిర్మిం చాలని నిర్ణయించినట్టు టీ జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు ఖమ్మం కలెక్టర్ ఇలంబర్తిని తీసుకెళ్లి సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో ప్రభాకర్‌రావు మంగళవారం సమావేశమయ్యారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను ఇప్పటికే ప్రారంభించామని సీఎం కేసీఆర్‌కు కలెక్టర్ వివరించినట్టు తెలిసింది. మణుగూరు సమీపంలో మొత్తం 2,500 ఎకరాల భూమిని అప్పగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ పేర్కొన్నట్టు సమాచారం.