Murali Mohan Reveals Interesting Facts About His Life In Latest Interview, Deets Inside - Sakshi
Sakshi News home page

Murali Mohan: శ్రీదేవి అమ్మగారు నన్ను తన ఇంటి అల్లుడిని చేసుకోవాలనుకున్నారు..

Jun 22 2023 9:37 PM | Updated on Jun 23 2023 11:37 AM

Murali Mohan Reveals Interesting Facts - Sakshi

ఇలాంటి అబ్బాయికి మనమ్మాయినిస్తే బాగుంటుందని ఆలోచించింది. మరి తనకు ఎందుకలా అనిపించిందో నాకు తెలియదు. నిర్మాతగా సినిమాలు చేద్దామంటే నన్ను సెట్స్‌

జగమే మాయ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు నటుడు మురళీ మోహన్‌. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత కీలక పాత్రలు చేస్తూ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారాడు. 15 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఉంటాననుకున్న ఆయన 50 ఏళ్లుగా నటుడిగా రాణిస్తున్నాడు. మధ్యలో రాజకీయాల్లోకి వెళ్లడంతో పదేళ్లపాటు సినిమాలకు బ్రేక్‌ ఇచ్చాడు. అయితే పూర్తిగా సినిమాలకే అంకితమవ్వాలనుకుంటున్నానని ఇటీవలే మురళీ మోహన్‌ తన మనసులోని మాటను బయటపెట్టాడు. 

అక్కినేని నాగేశ్వరరావు అభిమానిని అని చెప్పే ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. 'ఇండస్ట్రీలో ఉన్న శ్రీరామచంద్రుడిని నేనే అని నాగేశ్వరరావు నాకు సర్టిఫికెట్‌ ఇచ్చారు. శ్రీదేవి వాళ్ల అమ్మకు ఓ ఆలోచన వచ్చింది. ఈయన బుద్ధిమంతుడిలా ఉన్నాడు, బాగున్నాడు.. ఇలాంటి అబ్బాయికి మనమ్మాయినిస్తే బాగుంటుందని ఆలోచించింది. మరి తనకు ఎందుకలా అనిపించిందో నాకు తెలియదు. నిర్మాతగా సినిమాలు చేద్దామంటే నన్ను సెట్స్‌కు రావద్దన్నారు. అవసరమైనప్పుడు డబ్బులు పంపిస్తే చాలన్నారు. అలాంటప్పుడు ఇంకేం చేయాలి?' అన్నాడు మురళీ మోహన్‌.

చదవండి: నువ్వు లేకుండా ఇల్లు బోసిపోతోంది: పార్వతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement