
టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్‌ను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. తాజాగా మురళీమోహన్‌కు శస్త్ర చికిత్స జరగడంతో తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కేర్ ఆసుపత్రి బృందం వెన్నుముకకు సంబంధించిన ఈ చికిత్సను ఎంతో జాగ్రత్తగా అందించిందని, తాను ప్రస్తుతం క్షేమంగానే ఉన్నానని వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మురళీమోహన్‌ను చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment