
విజిలెన్స్ మోనటరింగ్ కమిటీ చైర్మన్‌గా మురళీమోహన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా విజిలెన్స్ అండ్ మోనటరింగ్ కమిటీకి చైర్మన్, కో-చైర్మన్లను నియమిస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ నియమితులయ్యారు. కో-చైర్మన్లుగా కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు, కో-చైర్‌పర్సన్‌గా అరకు ఎంపీ కొత్తపల్లి గీతను నియమించారు.