
పగబట్టిన పాము!
పాము పగ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నమైన కథాంశంతో రూపొందిన తమిళ చిత్రం ‘నంజుపురం’, తెలుగులో ‘నాగలాపురం’ పేరుతో విడుదల కానుంది. కె. సృజన సమర్పణలో మురళీమోహన్ కూసుపాటి ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. రాఘవ్, మోనికా జంటగా చార్లెస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ యువకుడు చేసిన పొరపాటు వల్ల పాము పగబడుతుంది. చంద్రగ్రహణం నాటికి అతన్ని చంపేయాలనుకుంటుంది. మహాభక్తురాలైన అతని ప్రేయసి ఎలాగైనా ప్రియుణ్ణి కాపాడుకోవాలనుకుంటుంది. తను అనుకున్నది సాధించిందా? లేదా అనేది తెరపై ఆసక్తిగా ఉంటుంది. ప్రేమ, పగ, సెంటిమెంట్‌తో సాగే సినిమా’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సహనిర్మాత: పి.మంగమ్మ.