మురళీమోహన్‌కు చేదు అనుభవం | Kadiyapulanka People Blocked Murali Mohan Election Campaign | Sakshi
Sakshi News home page

మురళీమోహన్‌కు చేదు అనుభవం

Apr 6 2019 1:23 PM | Updated on Apr 6 2019 1:23 PM

Kadiyapulanka People Blocked Murali Mohan Election Campaign - Sakshi

టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల ప్రచార రథాన్ని అడ్డుకుంటున్న ప్రజలు

కడియం, (రాజమహేంద్రవరం రూరల్‌) : తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో శుక్రవారం ప్రచారం చేపట్టిన ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిలకు జనం నుంచి చేదు అనుభవం ఎదురైంది. తమకు నాలుగున్నరేళ్లుగా రోడ్డు సమస్య ఉందని, పరిష్కరించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఇప్పుడు ఓట్లు అడిగేందుకు మా వీధిలోకి ఎలా వస్తారంటూ కడియపులంక కొబ్బరితోట కాలనీ, పల్లాలమ్మ గుడివీధికి చెందిన ప్రజలు అడ్డుకున్నారు. తమ వాహనాలను రోడ్డుకు అడ్డుగా పెట్టి వీధిలోకి రావద్దంటూ నిలబడ్డారు. మాజీ సర్పంచి భర్త వార రాము, ఎంపీటీసీ భర్త బోడపాటి గోపీలు అక్కడికి చేరుకుని స్థానికులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో మీరు ఓట్లు వేస్తే ఎంత? వేయకపోతే ఎంత? అంటూ టీడీపీ నేతలు వాదనకు దిగారు. ప్రచార రథంపై ఉన్న గోరంట్ల.. ‘వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. పోనీయవయ్యా.. ఎవడాపుతాడో చూస్తా..’ అంటూ ప్రచార రథాన్ని ముందుకు కదిలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement