
బాబు మ్యాజిక్ చేయడు.. అంతా కష్టపడాలి: మురళీమోహన్
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబు మాయ చేస్తాడు.. మ్యాజిక్ చేస్తాడు.. అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి కష్టపడాలి’ అని రాజమండ్రి టీడీపీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విజయవాడ ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని కావడం ఆంధ్రుల అదృష్టమని అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలించడం అంత సులువేమీ కాదని మురళీ మోహన్ ఉద్ఘాటించారు.