- లిస్టులో సినీ నటుడు మురళీ మోహన్, సతీష్‌రెడ్డి, పీవీ సింధు
- కేంద్రానికి సిఫార్సు చేసిన రాష్ట్ర సర్కారు
సాక్షి, అమరావతి: భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే పద్మ అవార్డులకు 22 మంది పేర్లతో జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. సినీ నటుడు, టీడీపీ ఎంపీ మురళీ మోహన్ పేరును పద్మభూషణ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. అలాగే రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు సతీష్‌రెడ్డి పేరును పద్మభూషణ్ అవార్డుకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజత పథక విజేత పీవీ సింధు, మృదంగ విద్మాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు, ప్రముఖ నృత్య కళాకారిణి ఆనంద శంకర జయంత పేర్లను పద్మభూషణ్‌కు సిఫార్సు చేసింది.
ఈఎన్‌టీ స్పెషలిస్ట్ విష్ణుస్వరూపరెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ గురువారెడ్డి, చేనేత రంగం నుంచి రమణయ్య, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ పేరును పద్మశ్రీకి సిఫార్సు చేసింది. ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో సర్జన్‌గా పనిచేస్తున్న సి.కె.దుర్గ పేరును కూడా పద్మ అవార్డుకు సిఫార్సు చేసింది. వీరితోపాటు మరిన్ని రంగాల్లో విశేష కృషి చేసిన వారి పేర్లనూ పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది.
22 పేర్లతో పద్మ అవార్డుల జాబితా
Published Tue, Oct 18 2016 1:30 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement