
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు. టోక్యో ఒలింపిక్స్‌కు సిద్దమవుతున్న కాలాన్ని ఆన్‌డ్యూటీగా పరిగణించాలని సీఎం వైఎస్ జగన్‌కు సింధు విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని సింధుకు సీఎం వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ స్థలం గుర్తింపు జరుగుతోందని.. అవసరమైన చోట ఎంపిక చేసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆమెకు చెప్పారు. కాగా, పీవీ సింధు ప్రస్తుతం ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.