ఆ హిట్ సినిమాకు 50 ఏళ్లు.. ఘనంగా స్వర్ణోత్సవం! | Producer Kakarla Krishna's Movie Celebrates Golden Festival | Sakshi
Sakshi News home page

Kakarla Krishna: నా జీవితాంతం తీపి జ్ఞాపకంగా ఉంటుంది: కాకర్ల కృష్ణ

Published Tue, Dec 26 2023 2:13 PM | Last Updated on Tue, Dec 26 2023 2:57 PM

Producer Kakarla Krishna Movie Completed 50 Years Of Golden Festival  - Sakshi

ప్రముఖ నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సూపర్‌ స్టార్‌ కృష్ణ, అంజలీదేవి, చంద్రకళ ప్రధాన పాత్రల్లో కె. సత్యం దర్శకత్వంలో కాకర్ల కృష్ణ నిర్మించిన చిత్రం ‘ఇంటింటి కథ’ (1974). ఈ సినిమా విడుదలై 50 ఏళ్లయిన సందర్భంగా నిర్మాత కాకర్ల కృష్ణ స్వర్ణోత్సవం జరిగింది. కాకర్ల కృష్ణ మనవడు త్రికాంత్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత, నటుడు మురళీ మోహన్‌ హాజరయ్యారు.

మురళి మోహన్ మాట్లాడుతూ– ‘‘వీబీ రాజేంద్ర ప్రసాద్‌గారి జగపతి సంస్థలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా ప్రయాణం ప్రారంభించిన కృష్ణ ఆ తర్వాత ‘ఇంటింటి కథ’ సినిమాతో నిర్మాతగా మారారు’ అని అన్నారు.

కాకర్ల కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఇంతమంది ఆత్మీయల సమక్షంలో నా స్వర్ణోత్సవం జరగటం సంతోషంగా ఉంది. ఇది నా జీవితాంతం తీపి జ్ఞాపకంగా ఉంటుంది. కృష్ణ స్వర్ణోత్సవం జరగడం సముచితంగా, సంతోషంగా ఉంది’’ అన్నారు రచయిత పరుచూరి గోపాలకృష్ణ. నిర్మాతలు కె. దామోదర ప్రసాద్, జి. ఆదిశేషగిరి రావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement