Murali Mohan Interesting Comments On Krishna: సూపర్ స్టార్ కృష్ణపై సీనియర్ నటుడు మురళీ మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కృష్ణలాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదంటూ ప్రశంసలు కురిపించారు. కాగా నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిచన ఆయన అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఇద్దరం ఇంటర్‌లో క్లాస్‌మెట్స్, ఒకే బెంచ్‌లో కూర్చునే వాళ్లమంటూ ఆసక్తికర విషయం చెప్పారు.
చదవండి: బిడ్డను వదిలేసి వచ్చిందని ట్రోల్స్, స్పందించిన కమెడియన్
అలాగే ‘ఇంటర్ ఇద్దరం ఒకే కాలేజీలో చదివాం. ఇద్దరం ఇంటర్ ఫెయిల్ అయ్యాం. అయితే కాలేజీ మొత్తంలో కృష్ణ చాలా అందగాడు. అందరు ఆయన వెంట పడేవారు. ఇంటర్ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆయన తేనె మనసులు మూవీతో హీరోగా మారారు. ఆ తర్వాత అనతి కాలంలోనే ఆయన సూపర్ స్టార్‌గా ఎదిగిన విషయం మీ అందరికి తెలిసిందే’ అంటూ చెప్పుకొచ్చారు. అనంతరం తాను కూడా కొద్ది రోజుల్లోనే సినిమాల్లోకి వచ్చానని, హీరోగా కొన్ని సినిమాలు చేశానన్నారు. ఆ తర్వాత నటుడి నుంచి నిర్మాతగా మారానంటూ వారసుడి మూవీ సమయంలో చోటు చేసుకున్న ఓ చేదు సంఘటన గురించి చెప్పారు.
చదవండి: గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
‘కృష్ణ-నాగార్జున కాంబినేషన్‌లో వారసుడు చిత్రాన్ని నిర్మించాను. ఆ సినిమాలో నాగార్జున ఓ సీన్‌లో తండ్రి కృష్ణను నిలదీస్తాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఘర్ణణ తారాస్థాయికి చేరుతుంది. ఇందులో కృష్ణను నాగార్జున ఎదురించడం, నువ్వెంత అంటూ ఆయనతో అమర్యాదగా వ్యవహరిస్తాడు. అది చూసిన కృష్ణ ఫ్యాన్స్ మా ఇంటి మీదకు గొడవకు వచ్చారు. కొంతమంది అయితే ఏకంగా నన్ను కొట్టడానికి వచ్చారు’ అని అన్నారు. అంతేకాదు కృష్ణ గారిని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడతాడని, ఇది ఆయనను అగౌరవ పరచడమే అంటూ తనతో ఘర్షణ పడ్డారన్నారు. ఆ సీన్‌ని సినిమా నుంచి తొలగించాలని, లేదంటే సీన్ మార్చమంటూ డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారని ఆయన అన్నారు.
చదవండి: ‘కేజీఎఫ్’ హీరో యశ్‌పై కంగనా ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే ‘‘అది సినిమా.. కథను, పాత్రను బట్టి చూడండి. పర్సనల్‌గా తీసుకోవద్దు’ అని నేను నచ్చచెప్పినా వినలేదు. దీన్ని బట్టి అప్పడు నాకు అర్థమైంది ఆయనకు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని. ఇక కృష్ణ గారు బయట కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన నిర్మాతల హీరో అని అనొచ్చు. ఒక నిర్మాత సినిమా ప్లాప్‌తో డబ్బులు పోగొట్టుకుంటే.. ఇంటికి పిలిచి ఆయనతో మాట్లాడి .. తనతో సినిమా చేస్తానని చెప్పేవారు. నిర్మాతలు డబ్బులు లేవని చెప్పినా అవన్నీ తరువాత మీరు సినిమా మొదలు పెట్టండి అని భరోసా ఇచ్చేవారు. అలాంటి గొప్ప మనిషిని నేను ఇంతవరకు చూడాలేదు” అని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. కాగా తెలుగులో మురళీమోహన్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కృష్ణ, శోభన్ బాబు వంటివారు అగ్ర హీరోలుగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన మురళీమోహన్. తక్కువ కాలంలోనే హీరోగా గుర్తింపును తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment