ఒకటి కాదు.. 33..! | shivaganesh self directed | Sakshi
Sakshi News home page

ఒకటి కాదు.. 33..!

Published Sat, Jun 14 2014 12:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

ఒకటి కాదు.. 33..!

ఒకటి కాదు.. 33..!

వివేక్, సునీత మరసియార్ జంటగా రూపొందిన చిత్రం ‘33 ప్రేమకథలు’. మురళీమోహన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని శివగణేశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అజయ్ పట్నాయక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని మురళీమోహన్, ప్రచార చిత్రాలను చింతల రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. మురళీమోహన్ మాట్లాడుతూ -‘‘ఈ ‘33 ప్రేమకథల్లో’ నాదీ ఓ కథ. అదెలా ఉంటుందో మీరు తెరపైనే చూడాలి.

దర్శకుడు ఉత్సాహవంతుడు. ఏదో చేయాలనే తపన అతనిలో ఉంది. పెద్ద బడ్జెట్‌లో తీసిన చిన్న సినిమా ఇది’’ అన్నారు. ఇందులోని 8 పాటలనీ పదిమంది సంగీత దర్శకులు పాడారని, ఈ ఫీట్ దర్శకుని వల్లే కుదిరిందని సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ చెప్పారు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు నూకారపు సూర్యప్రకాశరెడ్డి, పూర్ణిమ, కృష్ణుడు, శివపార్వతి తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement