Self-directed
-
మెగాఫోన్ పట్టనున్న శ్రుతి
తమిళసినిమా: ఏమీటి ఆది అంతం లేకుండా ఈ స్టార్ట్–కట్–ఒన్మోర్–ఓకే–పేకప్ల గొడవవేమిటన్నదే మీ సందేహం.పైన పదాలన్నీ సినీ పరిశ్రమలోని వారికి సుపరిచిత పదాలే. ముఖ్యంగా అందాల భామ శ్రుతీహాసన్‌కు బాగా పరిచయం. ఎందుకంటే తన కుటుంబమే ఒక విజయవంతమైన సినిమా. శ్రుతి సినిమాలోనే పుట్టి పెరిగిన నటి. అమ్మ, నాన్న, చెల్లెలు,పెదనాన్న ఇలా అందరికీ సినిమానే జీవితం. కాగా సరిగమలతో తెరంగేట్రం చేసిన శ్రుతీహాసన్ ఆ తరువాత నటనతో, గానంతో సుపరిచితురాలయ్యారు. ఇలా భారతీయ సినిమాలోనే తనకుంటూ చెరగని ముద్ర వేసుకున్న శ్రుతీహాసన్ పులి కడుపున పులిబిడ్డ కాకండా పిల్లి పుడుతుందా అనే స్థాయికి ఎదిగిపోయారు.ఆమె తండ్రి కమలహాసన్ సకలకళావల్లభుడని ఇప్పుడు ప్రత్యేకంగా ఉదహరించాల్సిన అవసరం లేదు.అయనలో లేని కళ లేదనే చెప్పాలి.తాజాగా ఆయన వారుసురాలి అడుగులు అదే బాటలో పడుతున్నాయా?అవుననే అనిపిస్తోంది. శ్రుతీహాసన్ నటిగా, సంగీతదర్శకురాలిగా, గాయనిగా నిరూపించుకున్నారు. ఇవన్నీ తెర ముందు తెర వెనుక శాఖలు.తాజాగా కెమెరా వెనుక నిలబడనున్నారనే వార్త బలంగా వినబడుతోంది.ఎస్.శ్రుతీహాసన్లో మంచి కథకురాలు కూడా ఉన్నారు.దాన్నిప్పుడు పదును పెట్టే పనిలో ఉన్నారట.అంతే కాదు మెగాఫోన్ పట్టి ఆ కథను తనే స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం మీడియాలో హల్చల్ చేస్తోందిప్పుడు.ఈ శుభవార్తను శ్రుతి త్వరలోనే చెప్పబోతున్నారట.అప్పటి వరకూ ఎదురు చూద్దామా‘మొత్తం మీద ఇప్పటి వరకూ ఇతర దర్శకులు స్టార్ట్ యాక్షన్ అనగానే నటిస్తున్న శ్రుతీహాసన్ త్వరలో తనే స్టార్ట్ యాక్షన్ కట్ చెప్పడానికి రెడీ అవుతున్నారన్న మాట. -
సముద్రకని కర్త, కర్మ ,క్రియగా అప్పా
నవ్యతకు చిరునామా మలయాళ సినిమా అన్నది ఇంతకు ముందు మాట. ఇప్పుడు దాన్ని తమిళ సినిమా ఆక్రమించుకుందని చెప్పవచ్చు. నాడోడిగళ్ చిత్రంతో సరికొత్త ట్రెండ్ సృష్టించిన దర్శకుడు సముద్రకని ఆ తరువాత కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించినా ఒక దశలో దర్శకత్వాన్ని దూరంగా పెట్టి పూర్తిగా నటనపైనే దృష్టి సారిస్తూ వస్తున్నారు. ఆ మధ్య కిత్నా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించాలని భావించారు. అయితే ఆసమయంలో అమలాపాల్ పెళ్లికి సిద్ధం అవడంతో సముద్రకని తన ప్రయత్నానికి తాత్కాలికంగా ఫుల్స్టాప్ పెట్టారు. తాజాగా ఆయన నటన, దర్శకత్వంతోపాటు నిర్మాతగా అదనపు బాధ్యతలు చేపట్టి అప్పా(నాన్న)అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సెలైంట్‌గా నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి సముద్రకని తెలుపుతూ నాగోడిగళ్ ప్రొడక్షన్స్ పతాకంపై తొలిసారిగా అప్పా అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తూ నటిస్తున్నానని చెప్పారు. ఇందులో కాక్కాముట్టై చిత్రం ఫేమ్ విఘ్నేశ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. త ంబిరామయ్య, వినెధిని, నవ నటి ప్రీతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారని చెప్పారు. ఇది తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రం అని వివరించారు. కచ్చితంగా అప్పా చిత్రం తమిళ సినిమాకు కొత్తగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారని, ఆయన చిత్రం చూసి అద్భుతంగా తీశావంటూ ప్రశంసించారని సముద్రకని పేర్కొన్నారు. చిత్రాన్ని వచ్చే నెల విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
సకుటుంబ కథా చిత్రం
మనోజ్‌నందం, స్మితిక, మోనికసింగ్ ప్రధాన తారలుగా పి.రమేశ్ బాబుల్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’. సాకేత్నాయుడు స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సీడీని హీరో సందీప్‌కిషన్ ఆవిష్కరించి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి అందించారు. వీరితో పాటు మాజీ మంత్రి తులసిరెడ్డి, యువ హీరో అభిజిత్.. సినిమా విజయం సాధించాలి ఆకాంక్షించారు. సకుటుంబంగా చూడదగ్గ సినిమా ఇదనీ, సాకేత్ చక్కని సంగీతం ఇచ్చారనీ రమేశ్ బాబుల్‌రెడ్డి అన్నారు. అన్ని పాటలూ బాగా కుదిరాయని సాకేత్ అన్నారు. -
దళిత కూలీ రామయ్య పోరాటం
ట్రెండ్లు పట్టించుకోకుండా, ఫార్ములాలకు దూరంగా తను నమ్మిన సిద్ధాంతంతో గత మూడు దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్న ఏకైక కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి. ఆయన చేసిన ‘అర్ధరాత్రి స్వతంత్రం’, ‘ఎర్ర సైన్యం’ సినిమాలు ఏడాదికి పైగా ప్రదర్శితమయ్యాయి. ‘చీమలదండు’ రజతోత్సవం జరుపుకొంది. ‘దండోరా, అడవి దివిటీలు, దళం, ఊరు మనదిరా’ తదితర చిత్రాలు శత దినోత్సవాలు జరుపుకొన్నాయి. ఇంకా ఆయన కెరీర్లో ఇలాంటివి ఎన్నో విజయాలు ఉన్నాయి. ఇన్ని విజయాలున్నా ఎప్పటికప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే ఆయన తీసిన తాజా సినిమా ‘రాజ్యాధికారం’. ఆయన నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘ఆనాటి నుంచి ఈనాటి వరకూ దళితులు వెనుకబడటానికి కారణమేమిటనే నేపథ్యంలో ఈ సినిమా తీశాను. అధికారం కోసం కొందరు స్వార్థపూరిత రాజకీయ నాయకులు చేసే అకృత్యాలను ఇందులో ఎండగడుతున్నా. ఇందులో నేను దళిత కూలీ రామయ్య పాత్ర పోషించా. అతను చేసే పోరాటమే ఈ సినిమా. తనికెళ్ల భరణి, స్వర్గీయ నటి తెలంగాణ శకుంతల నెగిటివ్ రోల్స్ చేశారు. ఇందులోని ఏడు పాటలూ జనాదరణ పొందాయి’’ అని తెలిపారు. -
ఒకటి కాదు.. 33..!
వివేక్, సునీత మరసియార్ జంటగా రూపొందిన చిత్రం ‘33 ప్రేమకథలు’. మురళీమోహన్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని శివగణేశ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. అజయ్ పట్నాయక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని మురళీమోహన్, ప్రచార చిత్రాలను చింతల రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. మురళీమోహన్ మాట్లాడుతూ -‘‘ఈ ‘33 ప్రేమకథల్లో’ నాదీ ఓ కథ. అదెలా ఉంటుందో మీరు తెరపైనే చూడాలి. దర్శకుడు ఉత్సాహవంతుడు. ఏదో చేయాలనే తపన అతనిలో ఉంది. పెద్ద బడ్జెట్లో తీసిన చిన్న సినిమా ఇది’’ అన్నారు. ఇందులోని 8 పాటలనీ పదిమంది సంగీత దర్శకులు పాడారని, ఈ ఫీట్ దర్శకుని వల్లే కుదిరిందని సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ చెప్పారు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు నూకారపు సూర్యప్రకాశరెడ్డి, పూర్ణిమ, కృష్ణుడు, శివపార్వతి తదితరులు మాట్లాడారు.