
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “రేవు”.

ఈ చిత్రంలో గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి నిర్మిస్తున్నారు. నవీన్ పారుపల్లి సమర్పకులుగా ఉన్నారు.

ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు. సినిమా ప్రొడక్షన్ పర్యవేక్షకులుగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ ప్రభు వ్యవహరిస్తున్నారు.

హరినాథ్ పులి దర్శకత్వం వహించారు

తాజాగా ఈ మూవీ టీమ్ ఫ్యాషన్ షో మరియు స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర బృందంతో పాటు మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్ నంది, ఉత్తేజ్ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు.
