Samantha Buys Same House Shared With Naga Chaitanya Before Separation, Details Inside - Sakshi
Sakshi News home page

Murali Mohan On Samantha House: చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సామ్‌

Published Thu, Jul 28 2022 8:18 PM | Last Updated on Sun, Jul 31 2022 11:38 AM

Samantha Buy Same House She Shared with Naga Chaitanya Before Separation - Sakshi

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత మీద విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆమె ఏం చేసినా తప్పుపట్టారు నెటిజన్లు. అంతేకాదు, చైతూ నుంచి కోట్లాది రూపాయలు భరణం తీసుకుందని, ఆస్తి రాయించుకుందని ఏవేవో పుకార్లు వ్యాప్తి చెందాయి. అయితే ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ షోలో పాల్గొన్న సామ్‌ అవన్నీ అసత్యపు ప్రచారాలేనని కుండ బద్ధలు కొట్టేసింది. తాజాగా సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

'నాగచైతన్య- సమంత మా ఇల్లు కొనుక్కున్నారు. అందులోనే కలిసి ఉండేవారు. తర్వాత వారిద్దరూ కలిసి ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ కొనుక్కున్నారు. అందుకని వారు నివసిస్తున్న ఇంటిని అమ్మేశారు. కానీ కొత్తిల్లు రీమోడలింగ్‌ చేసేంతవరకు ఇక్కడే ఉంటామని అనడంతో మా ఇల్లు కొనుక్కున్నవారు సరేనని అంగీకరించారు. ఇంతలోనే వీరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఆ తర్వాత మంచి ఇంటి కోసం సమంత బయట ఎక్కడెక్కడో చూసొచ్చింది.. కానీ ఎక్కడా తనకు నచ్చలేదు. సేఫ్టీ కూడా ఇక్కడే బాగుందని అభిప్రాయపడిన సమంత నా దగ్గరకు వచ్చి ఇల్లు కావాలని అడిగింది. మేము మీకు అమ్మాం, మీరు ఇంకొకరికి అమ్మారు కదా, ఇప్పుడేం చేయగలనమ్మా.. అన్నాను. అప్పుడామె ఆ ఇల్లు కొన్నవాళ్లతో మాట్లాడి వారికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆ ఇంటిని తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం అక్కడే తన తల్లితో కలిసి నివసిస్తోంది' అని చెప్పుకొచ్చాడు మురళీ మోహన్‌.

చదవండి: భారీ బడ్జెట్‌, అత్యంత ఘోరమైన ఫ్లాప్‌.. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు
రెండో పెళ్లి, వివాహమైన ఐదు నెలలకే బిడ్డకు జన్మనిచ్చిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement