హైదరాబాద్: 2013, 2014 ఏళ్లకు ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాల ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సినీ నటుడు, ఎంపీ మురళీ మోహన్ చైర్మన్‌గా జ్యూరీని నియమించింది. మొత్తం ఆరుగురు ఉండే ఈ కమిటీలో విశ్రాంత ఐఏఎస్ అధికారులు జి.బ్రహ్మయ్య, ఎన్.ముక్తేశ్వరరావు సభ్యులుగానూ, సమాచార శాఖ కమిషనర్ ఎన్వీ రమణారెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. దీనికి తోడు 2013, 14 సంవత్సరాలకు నంది నాటక అవార్డుల ఎంపికకు కూడా పలు కమిటీలను నియమించారు.