ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం పట్ల మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ సంతాపం ప్రకటించారు.
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం పట్ల మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ సంతాపం ప్రకటించారు. ఆయన్న ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించారని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.
వ్యక్తిగతంగా ఆయనెంతో నిజాయితీపరుడని వెల్లడించారు. నటీనటులను ఆయన ఎంతో గౌరవించేవారని చెప్పారు. ఫిల్మ్ నగర్ ఆలయం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం తీరని లోటని సంగీత దర్శకుడు కోటి అన్నారు.