jagapathi pictures
-
మధ్యాహ్నం వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు
హైదరాబాద్ : జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి. ఆయన భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, ఎంపీ, నటుడు మురళీ మోహన్ తదితరులు ఈరోజు ఉదయం రాజేంద్రప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ సందర్శనార్థం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకూ ఫిలిం చాంబర్లో రాజేంద్రప్రసాద్ పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. కాగా కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. -
కథానాయకుడు కాబోయి...
హైదరాబాద్: డాక్టర్ని కాబోయి యాక్టర్ అయ్యామని సినిమా వాళ్లు అంటూరు. కానీ వీబీ రాజేంద్రప్రసాద్ మాత్రం హీరో అవుదామని చిత్రసీమకు వచ్చి నిర్మాతగా మారారు. అనివార్య పరిస్థితుల్లో దర్శకుడి అవతారం కూడా ఎత్తారు. నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విజయవంతం అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. రాఘవ కళా సమితి ద్వారా రంగస్థలం ప్రవేశం చేసిన రాజేంద్రప్రసాద్.. ఆత్రేయ కప్పల్ నాటకంలో పంకజంగా ఆడవేషం వేశారు. తన కుమారుడు జగపతిబాబును హీరోను చేసి తన కోరికను తీర్చుకున్నారు. నిర్మాతగా ఘన విజయాలు సాధించినా వినమ్రతతో మెలిగారు. నటీనటులను ఎంతో గౌరవించేవారు. సినిమా నిర్మాణం మానుకున్నాక ఆధ్యాత్మిక సేవలో గడిపారు. ఫిల్మ్ నగర్ లో ఆలయం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. -
జీవించినంతకాలం రాజులా బతికారు: జగపతిబాబు
హైదరాబాద్: తన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ జీవించినంతకాలం రాజులా బతికారని ప్రముఖ నటుడు జగపతిబాబు అన్నారు. తన జీవితంలో ఎవరినీ బాధ పెట్టలేదన్నారు. తన తండ్రి ఎటువంటి బాధ లేకుండా మనశ్శాంతిగా నిష్క్రమించారని జగపతిబాబు మీడియాతో చెప్పారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్ కు తీసుకెళ్లడం లేదని, తమ ఇంటికే తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రేపు తమ ఇంటిదగ్గర ఉంచుతామన్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా బాధపడ్డారని, మళ్లీ పుంజుకున్న తర్వాత సంతోషించారని జగపతిబాబు తెలిపారు. తాను జీవితంలో స్థిరపడాలన్న నాన్నగారి కోరిక నెరవేరిందన్నారు. తన కూతురు, తన సోదరుడి కుమార్తె పెళ్లిళ్ల కోసం ఆరాటపడ్డారని చెప్పారు. వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు కుదిరాయన్న శుభవార్తలు విన్న తర్వాతే ఆయన కన్నుమూశారన్నారు. -
వీబీ రాజేంద్రప్రసాద్ కన్నుమూత
-
'వీబీ రాజేంద్ర ప్రసాద్ నిజాయితీపరుడు'
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం పట్ల మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ సంతాపం ప్రకటించారు. ఆయన్న ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించారని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. వ్యక్తిగతంగా ఆయనెంతో నిజాయితీపరుడని వెల్లడించారు. నటీనటులను ఆయన ఎంతో గౌరవించేవారని చెప్పారు. ఫిల్మ్ నగర్ ఆలయం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం తీరని లోటని సంగీత దర్శకుడు కోటి అన్నారు. -
‘బంగారు బాబు’ కన్నుమూత
కొంత కాలంగా గొంతుకేన్సర్తో బాధపడుతున్న వీబీఆర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన దర్శక నిర్మాత రాజేంద్రప్రసాద్ అభిమానుల సందర్శనార్థం నేడు ఫిలిం చాంబర్‌కు పార్థివదేహం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్ (82) సోమవారం కన్నుమూశారు. కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమించింది. దీంతో వారం క్రితం సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. మృతికి సంతాపంగా మంగళవారం ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానాన్ని మూసేస్తున్నట్లు జేఎస్ సూర్యనారాయణ తెలిపారు. ఫిలింనగర్ సొసైటీకి సెలవు ప్రకటించారు. రారాజులా బతికారు: జగపతిబాబు తన తండ్రి ఎవరినీ బాధపెట్టకుండా, ఏనాడూ బాధపడకుండా జీవితాంతం రారాజులా బతికారని వీబీఆర్ కుమారుడు, సినీహీరో జగపతిబాబు అన్నారు. తాను జీవితంలో స్థిరపడాలన్న తండ్రి కోరిక నెరవేరిందన్నారు. తన కుమార్తెతోపాటు తన అన్న కుమార్తె పెళ్లి కూడా చూడాలనే ఆశ ఆయనకు ఉండేదని, వారి పెళ్లిళ్లు కుదరడంతో ఆయన ఎంతో సంతోషించారని ఆస్పత్రి వద్ద జగపతిబాబు మీడియాకు తెలిపారు. తీరని లోటు: కేసీఆర్ వి.బి. రాజేంద్రప్రసాద్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీరంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన మరణం తెలుగు సినిమాకు తీరని లోటన్నారు. వీబీ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వీబీ రాజేంద్రప్రసాద్ మృతిపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. కాగా, వీబీ మృతిపట్ల చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కృష్ణా జిల్లాలో విషాద ఛాయలు... రాజేంద్రప్రసాద్ మరణంతో ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. జిల్లాలోని గుడివాడలో 1932 నవంబర్ 4న రాజేంద్రప్రసాద్ జన్మించారు. కాకినాడ ఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు, గుడివాడ ప్రాంతాల్లో ఆయన కుటుంబం నివసించింది. ఆత్రేయ రాసిన ‘కప్పలు’ అనే నాటకంలో రాజేంద్రప్రసాద్ స్త్రీ పాత్ర పోషించారు. కొద్ది కాలం తర్వాత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు జగపతిబాబు సినీహీరోకాగా, పెద్ద కుమారుడు రాము, రెండో కుమారుడు యుగంధర్‌కుమార్ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఫిలింనగర్ వెంచర్-2లో నివాసం ఉంటున్న రాజేంద్రప్రసాద్ ప్రతిష్టాత్మక ఫిలింనగర్ దైవసన్నిధానానికి వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీకి 16 ఏళ్లపాటు సేవలు అందించారు. ఆయన 14 సినిమాలకు దర్శకత్వం వహించారు. దసరాబుల్లోడు సినిమాకు దర్శకత్వం వహించిన వీబీ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2003లో రఘుపతి వెంకయ్య జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన మృతితో ఫిలింనగర్లో విషాదఛాయలు అలముకున్నాయి.