
కుమారుడు జగపతిబాబుతో వీబీ రాజేంద్రప్రసాద్
హైదరాబాద్: డాక్టర్ని కాబోయి యాక్టర్ అయ్యామని సినిమా వాళ్లు అంటూరు. కానీ వీబీ రాజేంద్రప్రసాద్ మాత్రం హీరో అవుదామని చిత్రసీమకు వచ్చి నిర్మాతగా మారారు. అనివార్య పరిస్థితుల్లో దర్శకుడి అవతారం కూడా ఎత్తారు. నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విజయవంతం అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు.
రాఘవ కళా సమితి ద్వారా రంగస్థలం ప్రవేశం చేసిన రాజేంద్రప్రసాద్.. ఆత్రేయ కప్పల్ నాటకంలో పంకజంగా ఆడవేషం వేశారు. తన కుమారుడు జగపతిబాబును హీరోను చేసి తన కోరికను తీర్చుకున్నారు. నిర్మాతగా ఘన విజయాలు సాధించినా వినమ్రతతో మెలిగారు. నటీనటులను ఎంతో గౌరవించేవారు. సినిమా నిర్మాణం మానుకున్నాక ఆధ్యాత్మిక సేవలో గడిపారు. ఫిల్మ్ నగర్ లో ఆలయం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు.