VB Rajendra Prasad
-
హీరోయిన్లతో నాకు చాలా ఎఫైర్స్ ఉన్నాయి : వి. బి. రాజేంద్రప్రసాద్
-
ఆ హీరోయిన్ నాకు చుక్కలు చూపించింది
-
'ఏమయ్యా! ఇవాళ టిఫిన్ ఎక్కువయిందా?'
జగపతి గెస్ట్‌హౌస్‌లో షూటింగ్. మేనేజర్ హుస్సేన్ వచ్చి ‘లంచ్‌కి ఏం కావాలి?’ అని అడిగారు. నేను మేకప్ చేసుకుంటున్నాను. నవ్వి, ‘నేను ఈ సినీమాకి హీరోని. హోటల్ చోళా నుంచి ఫలానా ఐటమ్స్ తెప్పించండి!’ అన్నాను. ఆ రోజుల్లో ‘జగపతి’ సంస్థ అంటే మాకందరికీ పెద్ద గ్లామరు. కారణం.. మంచి జనాదరణ పొందిన చిత్రాలను నిర్మించడం. అంతకుమించి నిర్మాత రాజేంద్రప్రసాద్ గారి పెద్ద మనస్సు, ఆదరణ, ఔదార్యాన్ని గురించి కథలుగా చెప్పుకునే వారు. ఆయన గురించి పొల్లుగా మాట్లాడిన ఒక్కరినీ నేను చూడలేదు. నేను ముమ్మరంగా సినీమాలు చేస్తున్న రోజుల్లో రాజేంద్రప్రసాద్ గారు పిలిపించారు. ఆయన మాట లివి: ‘నేను బాగా చితికిపోయాను. ఏం ఇమ్మంటారు?’ అని. నా సమాధానం గుర్తుంది. ‘మీ నోటి వెంట ఆ మాట రాకూడదు. మీ సంస్థలో చేయడం మంచి అవకా శం. మీరేమనుకుంటే అది చెయ్యండి’’ అన్నాను. ఏదో అంకె చెప్పారు. ‘ఎస్.పి. భయంకర్’ చిత్రం. నా ఆడ వేషానికీ, ‘ఆజా దేఖో మజా’ అనే ఖవ్వాలీ (నేనూ, అక్కి నేని చేసిన డ్యాన్స్)కీ ఆయన తీసుకున్న శ్రద్ధ ఆశ్చర్య కరం. వేషంలో నన్ను చూసి అక్కినేని, ‘మీరు నా కెరీ ర్లో 53వ హీరోయిన్’ అన్నారు. సినీమా అయిపోయింది. రేపు రిలీజనగా మేనేజర్ హుస్సేన్ మా ఇంటికి వచ్చి ‘ప్రొడ్యూసర్‌గారు ఇమ్మన్నారు’ అంటూ ఒక కవరు కిటికీ దగ్గర పెట్టి వెళ్లిపోయారు. అది అప్పుడు నేను తీసుకుంటున్న, నేను చెప్పని పైకం బ్యాలన్స్. అదీ ఆయన వితరణ. రాజేంద్రప్రసాద్‌గారు సినీమాల్లో నటించడానికి వచ్చారు మొదట్లో. కాని అనుకోని రెండు గొప్ప ప్రక్రియ లను చేపట్టారు - నిర్మాణం, దర్శకత్వం. ఆయన అక్కి నేని వీరాభిమాని. అంతకు ముందే ఆ కుటుంబాలకు సాన్నిహిత్యం ఉంది. నిర్మాత అయ్యాక అక్కినేనిని మొదటి సినీమా చేయమంటే ‘నేను నటించి నిన్ను చెడగొట్టను’ అన్నారట. జగ్గయ్య ప్రధాన పాత్రగా ‘అన్న పూర్ణ’ తీశారు. తర్వాత అన్ని చిత్రాలకు అక్కినేని హీరో. ఆయనంటే ఎంత అభిమానమంటే- ఏదయినా రిస్క్ తీసుకునే షాట్ చేయాలంటే- ముందు తను చేసి ఆయన్ని పిలిచేవారు. ఆయన అజాతశత్రువు. ఎవరినయినా కోపగించగా ఎవరూ చూసి ఉండరు. ఓసారి సెట్ మీద ఏదో విసుగు దలతో ‘ఏమయ్యా! ఇవాళ టిఫిన్ ఎక్కువయిందా?’ అని ఎవరితోనో అన్నారు. నా పక్కన ఉన్న అక్కినేని నవ్వి, ‘బహుశా బాబు జీవితంలో కోపంగా అన్నమాట ఇదేనేమో!’ అన్నారు. తనతో పనిచేసిన సిబ్బంది సంక్షే మానికి ప్రత్యేకంగా ఒక సినీమా తీసిన ఒకే ఒక్క నిర్మాత రాజేంద్రప్రసాద్‌గారు. ఆయన చిత్రాలలో పాటలు చాలా పాపులర్. పాట లన్నీ కలిపి గొలుసు చిత్రంగా తయారుచేశారు. దాని పేరు ‘చిటపట చినుకులు’. పాటలని అతికించే చిన్న సన్నివేశాలకి నటులు కావాలి. నన్నూ, రమాప్రభనీ ఎంపిక చేశారు. అంటే ఆ చిత్రానికి నేను హీరో. జగపతి గెస్ట్‌హౌస్‌లో షూటింగ్. మేనేజర్ హుస్సేన్ వచ్చి ‘లం చ్‌కి ఏం కావాలి?’ అని అడిగారు. నేను మేకప్ చేసుకుం టున్నాను. నవ్వి, ‘నేను ఈ సినీమాకి హీరోని. హోటల్ చోళా నుంచి ఫలానా ఐటమ్స్ తెప్పించండి!’ అన్నాను. నా పక్కన మేకప్ చేసుకుంటున్న రమాప్రభ నన్ను చేత్తో పొడిచింది కళ్లెగరేస్తూ. తీరా వెనక్కి చూస్తే రాజేంద్ర ప్రసాద్‌గారు కనిపించారు. సిగ్గుపడిపోయాను. ఆ రోజు లంచ్‌కి చోళా నుంచి నాకూ, రమాప్రభకీ పెద్ద పెద్ద పార్శిళ్లు వచ్చాయి. జగపతిబాబు నటించిన మొదటి చిత్రానికి (సింహ స్వప్నం) నేను విలన్ని. వి. మధుసూదనరావుగారు దర్శకులు. ఆయన తీసిన ‘భార్యాభర్తల అనుబంధం’ సినీమాలో నేను నటిస్తే, మా అబ్బాయి శ్రీనివాస్ ఆయన దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేశాడు. మా గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండేషన్ కార్యక్రమానికి శివాజీ గణేశన్‌గారిని పిలవాలని కోరిక. శివాజీగారు జగపతిలో పనిచేశారు. ఆయనకి ఫోన్ చేశాను. నన్ను స్వయంగా వెంటబెట్టుకుని శివాజీ గారింటికి తీసుకెళ్లారు. అదే నేను శివాజీగారిని కలవడం, ఇంటికెళ్లడం. ‘ఏమాత్రం వీలున్నా వస్తాను రాజా’ అన్నారు శివాజీ. ‘రాజా’ అన్న పిలుపులో శివాజీకి ఆయన పట్ల ఉన్న అభిమానం, ఆత్మీయతా పెల్లుబికింది. ఈమధ్య బి. నాగిరెడ్డిగారి స్మారక పురస్కార సభకి ప్రధాన అతిథిగా వచ్చారు. ఆయాసపడుతున్నారు. ఆరోగ్యం అంతంతమాత్రంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించాను. ‘బాగులేను. నా ఆస్త్మా తెలుసుకదా! ఇంక పైకి వెళ్లిపోవడమే’ అన్నారు. చివరి రోజుల్లో పూర్తిగా అంతర్ముఖులై ఫిలిం నగర్లో ఆలయ సముదాయాన్ని ఉద్ధరించే పనిలో నిమగ్నమయిపోయారు. మనస్సులో ఉన్న ఉదాత్తత పండి పరిపక్వతకు వచ్చిన దశ అది. తెలుగు సినీమా రంగంలో జగపతి ఓ చరిత్ర. రాజేంద్రప్రసాద్‌గారు అభిరుచికీ, అభినివేశానికీ, ఆదర ణకీ, ఔదార్యానికీ అరుదయిన ప్రతీక. -
వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు పూర్తి
-
మధ్యాహ్నం వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు
హైదరాబాద్ : జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రగడ్డ శ్మశానవాటికలో జరగనున్నాయి. ఆయన భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, దర్శకుడు రాఘవేంద్రరావు, ఎంపీ, నటుడు మురళీ మోహన్ తదితరులు ఈరోజు ఉదయం రాజేంద్రప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ సందర్శనార్థం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకూ ఫిలిం చాంబర్లో రాజేంద్రప్రసాద్ పార్థివదేహాన్ని ఉంచుతారు. అక్కడ నుంచి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. కాగా కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్ సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. -
ఆతిథ్యం అద్భుతం!
మనీ విషయంలో ఎంత కరెక్ట్‌గా ఉంటారో, ఫుడ్ విషయంలో అంత క్వాలిటీకి ప్రాధాన్యమిస్తారు. ఆయన ఆతిథ్య మర్యాదల గురించి సినీ పరిశ్రమలో అందరూ గొప్పగా చెప్పుకుంటారు. మెనూ ఎంపిక దగ్గర్నుంచీ వడ్డించేవరకూ వీబీ రాజేంద్రప్రసాద్ ‘అమ్మ’లా అనిపిస్తారని అందరూ చెబుతారు. -
కథానాయకుడు కాబోయి...
హైదరాబాద్: డాక్టర్ని కాబోయి యాక్టర్ అయ్యామని సినిమా వాళ్లు అంటూరు. కానీ వీబీ రాజేంద్రప్రసాద్ మాత్రం హీరో అవుదామని చిత్రసీమకు వచ్చి నిర్మాతగా మారారు. అనివార్య పరిస్థితుల్లో దర్శకుడి అవతారం కూడా ఎత్తారు. నిర్మాతగా, దర్శకుడిగా ఆయన విజయవంతం అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. రాఘవ కళా సమితి ద్వారా రంగస్థలం ప్రవేశం చేసిన రాజేంద్రప్రసాద్.. ఆత్రేయ కప్పల్ నాటకంలో పంకజంగా ఆడవేషం వేశారు. తన కుమారుడు జగపతిబాబును హీరోను చేసి తన కోరికను తీర్చుకున్నారు. నిర్మాతగా ఘన విజయాలు సాధించినా వినమ్రతతో మెలిగారు. నటీనటులను ఎంతో గౌరవించేవారు. సినిమా నిర్మాణం మానుకున్నాక ఆధ్యాత్మిక సేవలో గడిపారు. ఫిల్మ్ నగర్ లో ఆలయం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. -
నన్ను నటిగా ఆకాశానికి ఎత్తారు:వాణిశ్రీ
హైదరాబాద్: వీబీ రాజేంద్ర ప్రసాద్ సినిమా నిర్మాణ సంస్థ జగపతి బేనర్‌పై చిత్రం అంటే అందులో పనిచేసే అందరికీ పండుగేనని అలనాటి హీరోయిన్ కళాభినేత్రి వాణిశ్రీ చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారని తెలిసిన తరువాత ఆమె ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ ఆ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ మొదటిసారి దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్టయిన సంచలన చిత్రం దసరాబుల్లోడు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించారు. ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన వ్యవహార శైలిని, నడవడికను అనేక విధాల కొనియాడారు. వాణిశ్రీ మాటల్లోనే... రాజేంద్ర ప్రసాద్ గొప్ప వ్యక్తిత్వం గలవారు. అందరినీ ఎంతగానో గౌరవించేవారు. మంచి మనసున్న వ్యక్తి. ఆ నాటి అగ్ర హీరోలతో పోల్చితే నాకు అత్యధిక రెమ్యూనరేష్ ఇచ్చి ఆకాశానికి ఎత్తారు. దసరాబుల్లోడు, బంగారు బాబు రెండు చిత్రాలతో నన్ను బాగా హైలెట్ చేశారు. అప్పటివరకు ప్రతి చిత్రంలో నేను ధరించే చీరలను నేనే సెలక్ చేసుకునేదానిని. ఆయన సినిమాలలో మాత్రం చీరలను ఆయనే సెలక్ చేసేవారు. ఆయన గొప్ప నిర్మాత అయినప్పటికీ సినిమాటిక్ వ్యవహారాలు ఏమీ ఆయనకు లేవు.భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా చిరస్మరణీయుడు. -
జీవించినంతకాలం రాజులా బతికారు: జగపతిబాబు
హైదరాబాద్: తన తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ జీవించినంతకాలం రాజులా బతికారని ప్రముఖ నటుడు జగపతిబాబు అన్నారు. తన జీవితంలో ఎవరినీ బాధ పెట్టలేదన్నారు. తన తండ్రి ఎటువంటి బాధ లేకుండా మనశ్శాంతిగా నిష్క్రమించారని జగపతిబాబు మీడియాతో చెప్పారు. ఆయన భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్ కు తీసుకెళ్లడం లేదని, తమ ఇంటికే తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రేపు తమ ఇంటిదగ్గర ఉంచుతామన్నారు. తాను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా బాధపడ్డారని, మళ్లీ పుంజుకున్న తర్వాత సంతోషించారని జగపతిబాబు తెలిపారు. తాను జీవితంలో స్థిరపడాలన్న నాన్నగారి కోరిక నెరవేరిందన్నారు. తన కూతురు, తన సోదరుడి కుమార్తె పెళ్లిళ్ల కోసం ఆరాటపడ్డారని చెప్పారు. వాళ్లిద్దరికీ పెళ్లిళ్లు కుదిరాయన్న శుభవార్తలు విన్న తర్వాతే ఆయన కన్నుమూశారన్నారు. -
వీబీ రాజేంద్రప్రసాద్ కన్నుమూత
-
'వీబీ రాజేంద్ర ప్రసాద్ నిజాయితీపరుడు'
హైదరాబాద్: ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం పట్ల మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీమోహన్ సంతాపం ప్రకటించారు. ఆయన్న ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించారని అన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. వ్యక్తిగతంగా ఆయనెంతో నిజాయితీపరుడని వెల్లడించారు. నటీనటులను ఆయన ఎంతో గౌరవించేవారని చెప్పారు. ఫిల్మ్ నగర్ ఆలయం నిర్మాణంలో కీలకపాత్ర పోషించారని చెప్పారు. వీబీ రాజేంద్ర ప్రసాద్ మరణం తీరని లోటని సంగీత దర్శకుడు కోటి అన్నారు. -
‘బంగారు బాబు’ కన్నుమూత
కొంత కాలంగా గొంతుకేన్సర్తో బాధపడుతున్న వీబీఆర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన దర్శక నిర్మాత రాజేంద్రప్రసాద్ అభిమానుల సందర్శనార్థం నేడు ఫిలిం చాంబర్‌కు పార్థివదేహం వైఎస్ జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత, ప్రముఖ దర్శకుడు, నిర్మాత వీరమాచనేని బాబూ రాజేంద్రప్రసాద్ (82) సోమవారం కన్నుమూశారు. కొన్నేళ్లుగా గొంతు కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి ఇటీవల విషమించింది. దీంతో వారం క్రితం సోమాజిగూడలోని ఇషా ఆస్పత్రిలో చేర్పించగా సోమవారం తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం మంగళవారం ఫిలిం చాంబర్‌కు తరలించనున్నారు. మృతికి సంతాపంగా మంగళవారం ఫిలింనగర్‌లోని దైవ సన్నిధానాన్ని మూసేస్తున్నట్లు జేఎస్ సూర్యనారాయణ తెలిపారు. ఫిలింనగర్ సొసైటీకి సెలవు ప్రకటించారు. రారాజులా బతికారు: జగపతిబాబు తన తండ్రి ఎవరినీ బాధపెట్టకుండా, ఏనాడూ బాధపడకుండా జీవితాంతం రారాజులా బతికారని వీబీఆర్ కుమారుడు, సినీహీరో జగపతిబాబు అన్నారు. తాను జీవితంలో స్థిరపడాలన్న తండ్రి కోరిక నెరవేరిందన్నారు. తన కుమార్తెతోపాటు తన అన్న కుమార్తె పెళ్లి కూడా చూడాలనే ఆశ ఆయనకు ఉండేదని, వారి పెళ్లిళ్లు కుదరడంతో ఆయన ఎంతో సంతోషించారని ఆస్పత్రి వద్ద జగపతిబాబు మీడియాకు తెలిపారు. తీరని లోటు: కేసీఆర్ వి.బి. రాజేంద్రప్రసాద్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీరంగానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆయన మరణం తెలుగు సినిమాకు తీరని లోటన్నారు. వీబీ మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వీబీ రాజేంద్రప్రసాద్ మృతిపట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు. కాగా, వీబీ మృతిపట్ల చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కృష్ణా జిల్లాలో విషాద ఛాయలు... రాజేంద్రప్రసాద్ మరణంతో ఆయన స్వస్థలమైన కృష్ణా జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. జిల్లాలోని గుడివాడలో 1932 నవంబర్ 4న రాజేంద్రప్రసాద్ జన్మించారు. కాకినాడ ఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ డిగ్రీ చేశారు. ఆ తర్వాత గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు, గుడివాడ ప్రాంతాల్లో ఆయన కుటుంబం నివసించింది. ఆత్రేయ రాసిన ‘కప్పలు’ అనే నాటకంలో రాజేంద్రప్రసాద్ స్త్రీ పాత్ర పోషించారు. కొద్ది కాలం తర్వాత చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయనకు ముగ్గురు కుమారులు. చిన్న కుమారుడు జగపతిబాబు సినీహీరోకాగా, పెద్ద కుమారుడు రాము, రెండో కుమారుడు యుగంధర్‌కుమార్ వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. ఫిలింనగర్ వెంచర్-2లో నివాసం ఉంటున్న రాజేంద్రప్రసాద్ ప్రతిష్టాత్మక ఫిలింనగర్ దైవసన్నిధానానికి వ్యవస్థాపక మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఫిలింనగర్ కో-ఆపరేటివ్ సొసైటీకి 16 ఏళ్లపాటు సేవలు అందించారు. ఆయన 14 సినిమాలకు దర్శకత్వం వహించారు. దసరాబుల్లోడు సినిమాకు దర్శకత్వం వహించిన వీబీ ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2003లో రఘుపతి వెంకయ్య జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన మృతితో ఫిలింనగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
బి.నాగిరెడ్డి స్మారక పురస్కార కార్యక్రమం
-
నిర్మాతగా నాగిరెడ్డి చిరస్మరణీయుడు : వీబీ రాజేంద్రప్రసాద్
‘‘వాహినీ స్టూడియోలోని 22 ఫోర్లూ ఎప్పుడూ కళకళలాడుతుండేవి. ప్రతి సెట్‌కీ వెళ్లి... ఈ సెట్ ఎందుకు? ఇంత ఖర్చు దేనికి? అని అడుగుతుండేవారు నాగిరెడ్డి. నిర్మాత శ్రేయస్సు కోరి, వారి బాగోగులు చూసుకున్న మనసున్న వ్యక్తి ఆయన. ఆ చిరస్మరణీయుని పురస్కారం బీవీఎస్ఎన్ ప్రసాద్‌కి దక్కడం అతని అదృష్టం’’ అని వీబీ రాజేంద్రప్రసాద్ అన్నారు. విజయా మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా ప్రముఖ నిర్మాతలకు అందజేసే బి.నాగిరెడ్డి స్మారక పురస్కార కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. 2013వ సంవత్సరానికి గాను ‘అత్తారింటికి దారేది’ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు కింద లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక వీబీ రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. వీబీ రాజేంద్రప్రసాద్ ఇంకా చెబుతూ-‘‘అక్కినేనిగారితో ‘ఆత్మబలం’ తీస్తున్న రోజులవి. అప్పుడాయన షూటింగులన్నీ సారథీ స్టూడియోలోనే జరిగేవి. కానీ... బి.సరోజాదేవిగారిది చెన్నయ్ వదిలి రాలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో నాగేశ్వరరావుగారి అనుమతి తీసుకొని వాహినీ స్టూడియోలోనే సెట్లు వేశాం. మొత్తం ఏడు ఫ్లోర్లూ మాకే కేటాయించి షూటింగ్ సకాలంలో పూర్తి చేయడానికి నాగిరెడ్డి మాకు అందించిన సహకారం ఎప్పటికీ మరచిపోలేను’’ అని గతాన్ని నెమరువేసుకున్నారు. ఎస్.జానకి మాట్లాడుతూ- ‘‘విజయా సంస్థ అనగానే... అద్భుతమైన చిత్ర రాజాలు కళ్లముందు కదులుతాయి. ఆ సినిమాల్లోని పాటలు ఎంత బావుంటాయో! ఇప్పుడు అలాంటి పాటలు రావడం లేదు. విజయా సంస్థకు పాడే అదృష్టం నాక్కూడా దక్కింది. ‘భైరవద్వీపం’లో నేను పాడిన ‘నరుడా ఓ నరుడా’ పాట నాకు మంచి పేరు తెచ్చింది’’ అన్నారు. ‘‘సకుటుంబంగా చూడదగ్గ క్లాసిక్స్ నిర్మించారు నాగిరెడ్డి. ఇటీవల వచ్చిన సినిమాల్లో కుటుంబ ప్రేక్షకులను సైతం మెప్పించిన సినిమా ‘అత్తారింటికి దారేది’. ఆ చిత్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్‌కి నాగిరెడ్డిగారి పురస్కారం దక్కడం ముదావహం’’ అని వెంకటేశ్ అన్నారు. తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే ఆణిముత్యాల్లాంటి సినిమాలు నాగిరెడ్డి నిర్మించారని తనికెళ్ల భరణి కొనియాడారు. పురస్కార గ్రహీత బీవీఎస్ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ- ‘‘చిన్నప్పుడు బడి ఎగ్గొట్టి మరీ విజయావారి సినిమాలు చూసేవాణ్ణి. నాకు సినిమాపై ఇష్టాన్ని పెంచింది విజయావారి సినిమాలే. నా తొలి సినిమా కోసం విజయా గార్డెన్స్‌లో రికార్డింగ్స్ జరిపాం. అప్పుడు నాగిరెడ్డిగారు అక్కడకొచ్చి నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడు ఆయన అవార్డునే అందుకున్నాను’’ అని ఆనందం వెలిబుచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతిరావు, బి.నాగిరెడ్డి తనయుడు వెంకటరామిరెడ్డి, మాధవపెద్ది సురేశ్, విజయ మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు సీఈవో భారతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'అక్కినేని లేరనేది నమ్మలేని నిజం'
హైదరాబాద్ : అక్కినేని లేరనేది నమ్మలేని నిజమని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్స్ అధినేత , దర్శకుడు విబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆయన బుధవారం ఉదయం ఏఎన్నార్ భౌతికకాయన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అక్కినేనితో తన అనుబంధం విడదీయలేనిదన్నారు. ఆయనతో కలిసి తాను 14 సినిమాలు చేసానన్నారు. తామిద్దరం ఒక కంచం ....ఒకే మంచం అనేలా ఉండేవారిమని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. నాటికి...నేటికీ అక్కినేని అందరికి ఆదర్శమని ఆయన అన్నారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మాట్లాడుతూ తెలుగు చిత్ర పరిశ్రమలో మహా వృక్షం రాలిపోయిందన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రపరిశ్రమకు రెండు పిల్లర్లుగా ఉండేవారని అన్నారు. అక్కినేనితో తాను తీసిన 'ప్రేమ్ నగర్' చిత్రం తన జీవితంలో ఓ శక్తిలా మారిందన్నారు. ఆ సినిమాతో అప్పటివరకూ తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను తట్టుకున్నట్లు చెప్పారు. అక్కినేని కుటుంబంతో బంధుత్వం ఉండని... ఆయన మరణం బాధాకరమని రామానాయుడు అన్నారు. నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ అక్కినేని లేరనే వార్త జీర్ణించుకోలేనిదన్నారు. ఆయనతో కలిసి రెండు సినిమాలు చేసినట్లు తెలిపారు. -
చిటపట చినుకులు కురిసి 50 ఏళ్లు
సందర్భం:‘ఆత్మబలం’చిత్రానికి 50 ఏళ్లు ఏ సినిమాకైనా కథే బలం. ఆ తర్వాత తారాగణం బలం. సాంకేతిక బృందం బలం. పాటలు ఇంకా బలం. ఇన్ని బలాలు ఉన్నాయి కాబట్టే ఆత్మబలం చిత్రాన్ని 50 ఏళ్లయినా ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు. ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ ఇందులోనిదే. ఏయన్నార్ కెరీర్లో ఓ ఆణిముత్యంగా నిలిచిపోయిన ఈ చిత్రం ‘జగపతి’ సంస్థను తిరుగులేని నిర్మాణ సంస్థగా నిలబెట్టింది. ‘ఆరాధన’ సినిమా పెద్ద హిట్టు. నిర్మాతగా వి.బి.రాజేంద్రప్రసాద్‌కు ఇది రెండో విజయం. ‘అమ్మయ్యా... మనం నిలదొక్కుకున్నట్టే’ అని ఊపిరి ల్చుకున్నారాయన. కానీ ఎదురుగా కాలం కత్తితో గుచ్చడానికి సిద్ధంగా ఉంది. తనకు అండదండ, వెన్నూదన్నూ అనుకున్న మెయిన్ పార్టనర్ పర్వతనేని రంగారావు హఠాత్తుగా కాలం చేశారు. దాంతో మిగిలిన భాగస్వాములు కూడా ఎవరి దారిన వాళ్లు ళ్లిపోయారు.ఇప్పుడు వి.బి.రాజేంద్రప్రసాద్ ఒంటరి. తన వాళ్లనుకున్నవాళ్లెవరూ అండగా లేరు. అయితే ఊరు తిరిగి వెళ్లిపోవాలి. లేకపోతే ఒంటరిగా సినీ సముద్రాన్ని ఈదాలి.వి.బి.రాజేంద్రప్రసాద్ మొండివాడు. చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలనుకున్నాడు. గుండెల నిండా త్మవిశ్వాసం నింపుకున్నాడు. మళ్లీ సినిమా మొదలుపెట్టాలి. అర్జంట్‌గా కథ కావాలి. అప్పట్లో మన సినిమా వాళ్లందరికీ కలకత్తానే పెద్ద అడ్డా. బోలెడన్ని బెంగాలీ సినిమాలు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఉద్వేగాలు వాటిల్లో పుష్కలం. వి.బి.రాజేంద్రప్రసాద్ చలో కలకత్తా. అప్పుడు అక్కడ ఉత్తమ్‌కుమార్ నటించిన ‘అగ్ని సంస్కార’ సినిమా ఆడుతోంది. ఈయనకు బాగా నచ్చేసింది. అప్పటికప్పుడు నిర్మాతను కలిసి హక్కులు కొనేశారు. ప్రింట్ తీసుకుని మద్రాసులో దిగారు.ఇప్పుడు దీన్ని అక్కినేనికి చూపించాలి. ఆయన చూడ్డానికి కొంచెం టైం పట్టింది. కానీ చూడగానే ‘ఓకే’ అనేశారాయన. ఇంకేముంది... ‘ఆత్మబలం’ సినిమా స్టార్ట్. వి.మధుసూదనరావు డెరైక్టర్‌గా రెడీ. కేవీ మహదేవన్ మ్యూజిక్కు. సి.నాగేశ్వర్రావు ఫొటోగ్రఫీ. ఆత్రేయ మాటలూ పాటలూ. హీరోయిన్గా బి.సరోజాదేవి కాల్షీట్స్ ఇచ్చారు. జగ్గయ్య, కన్నాంబ, రేలంగి, రమణారెడ్డి, గిరిజ, సూర్యకాంతం... ఇలా హేమాహేమీలంతా ఓకే. ఈ పనులు ఇలా జరుగుతుంటే... ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది. అక్కినేని మద్రాసు వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోతున్నారు. ఇక ఏ నిర్మాత అయినా అక్కడకు వెళ్లి సినిమా తీయాల్సిందే. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్ కూడా హైదరాబాద్‌కు చలో అన్నారు. మొదట పాటల తయారీ మొదలైంది. కంపోజింగ్ కోసం మామ, ఆత్రేయ, మధుసూదనరావు, వి.బి.రాజేంద్రప్రసాద్... నలుగురూ బెంగళూరు వెళ్లారు. బృందావన్ హోటల్లో బస. మామకు కథ చెబితే ‘‘ఇందులో పాటలు పెట్టడం కష్టం. సిట్యుయేషన్స్ కుదరవు’’ అనేశారు. అప్పటికాయన టాప్ మ్యూజిక్ డెరైక్టర్. ‘ఆంధ్రపత్రిక’ ఎడిటోరియల్ ఇచ్చినా ట్యూన్ కట్టేస్తాడని ప్రతీతి. అలాంటాయనే ఇందులో సిట్యుయేషన్ కుదరదన్నాడంటే?.. వి.మధుసూదనరావుకి గుండెల్లో రాయి పడింది. రాత్రంతా ఆలోచించి సిట్యుయేషన్స్ ఎంచుకున్నారు. పొద్దున్నే మామకు చెబితే ఓకే అన్నారు. ఆత్రేయ కూడా ఇన్‌స్పయిర్ అయిపోయారు. కానీ రెండ్రోజులైనా పాట పుట్టదే! హాయిగా నచ్చిన ఫుడ్ తింటూ, బాగా రెస్టు తీసుకుంటున్నారు తప్ప, కలం మూత మాత్రం తీయలేదాయన. దాంతో దర్శక నిర్మాతలిద్దరికీ చిర్రెత్తుకొచ్చింది. ‘రేపే మన తిరుగుప్రయాణం’ అని చెప్పేశారాయనకు. దాంతో ఆత్రేయకు కంగారొచ్చింది. నిద్ర రాకుండా ఏవో మాత్రలు తెప్పించుకుని వేసుకున్నారు. నిద్ర రాలేదు... ఆయనలోంచి పాట కూడా రాలేదు. తెల్లవారు జామునే డ్రైవర్ని లేపి కారులో కబ్బస్ పార్కుకి వెళ్లారు. పలచగా జనం. అంతా వాకింగ్‌కొచ్చిన వాళ్లే. అకస్మాత్తుగా వర్షం మొదలైంది. అంతా పరుగులు. ఓ జంట మాత్రం ఓ గుబురు పొదలో దాక్కున్నారు. లోకాన్ని మరిచిపోయి ముద్దుమురిపాల్లో తేలిపోతున్నారు. ఇదంతా ఆత్రేయ కంటబడింది. ఆయనలో ప్రణయరసం ఉప్పొంగింది. ఆపై పాట పరవళ్లు తొక్కింది. ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’ అంటూ పాట రెడీ. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్ స్టార్ట్. అంతా సాఫీగానే ఉంది. అయితే మూడో షెడ్యూల్ సమయంలోనే తంటా వచ్చి పడింది. ఓ హిందీ సినిమా షూటింగ్లో అనుకోకుండా బి.సరోజ తలకు గాయమైంది. డాక్టరు 15 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అన్ని సినిమాల కాల్షీట్లూ వృథా. నిర్మాతల్లో టెన్షన్. వి.బి.రాజేంద్రప్రసాద్ ఆమె ఇంటికి వెళ్తే గూర్ఖా ఆపేశాడు. ఎంత చెప్పినా లోపలకు నో ఎంట్రీ. బి.సరోజ తల్లి చూసీ చూడనట్టు లోపలకు వెళ్లిపోయింది. దాంతో ఈయనకు ఏడుపొచ్చినంత పనైంది. అయినా తప్పదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి, డేట్లు ఎప్పుడో కనుక్కోవాలి. ఎల్వీ ప్రసాద్ కొడుకు ఆనంద్‌బాబు, ఈయనకు క్లోజ్. అతన్ని తీసుకుని బి.సరోజ ఇంటికెళ్లారు. ఒక నెల తర్వాత కాల్షీట్లు ఇస్తామని, 15 రోజుల్లోనే మొత్తం వర్క్ పూర్తి చేసుకోవాలని, అది కూడా అంతా మద్రాసులోనే జరగాలని కండిషన్స్. పాపం... వి.బి.రాజేంద్రప్రసాద్ పరిస్థితి అయోమయం అయిపోయింది. అక్కినేనిని మద్రాసు రమ్మనలేడు. బి.సరోజ హైదరాబాద్ రాదు. అటు నుయ్యి... ఇటు గొయ్యి. సినిమా మధ్యలో ఉంది. సరే... ధైర్యం చేసి అక్కినేనిని కలిసి విషయమంతా చెప్పేశారు. ‘‘అయితే... నేనే మద్రాసు వస్తా’’ అని భరోసా ఇచ్చారు అక్కినేని. దాంతో వి.బి.రాజేంద్రప్రసాద్‌కి కొండంత ధైర్యం వచ్చింది. మద్రాసులోని విజయా వాహినీ స్టూడియోలో సెట్స్ వేసి షూటింగ్ పూర్తి చేశారు. ‘చిటపట చినుకులు’ పాట ఇక్కడే తీశారు. తలకు తగిలిన దెబ్బ కనబడకుండా బి.సరోజ తలకు గుడ్డ కట్టారు. ఎట్టకేలకూ సినిమా రెడీ. మళ్లీ టెన్షన్. ఈసారి సెన్సార్ రూపంలో. సెన్సారాఫీసర్ శాస్త్రి చండశాసనుడు. కట్ అంటే కట్. నో డిస్కషన్. క్లైమాక్స్ చాలా భాగం కట్ చేసేయాలన్నారాయన. సినిమాకు అదే ఆయువు పట్టు. వీళ్లు ఎంత మొత్తుకున్నా వినలేదు. దాంతో క్లైమాక్స్ కట్ చేశారు. 1964 జనవరి 9న ‘ఆత్మబలం’ రిలీజైంది. పెద్ద మ్యూజికల్ హిట్టు. ఏడు పాటలూ మార్మోగిపోయాయి. అసలు పాటల కోసమే మళ్లీ మళ్లీ చూసిన వాళ్లు ఉన్నారు. ‘చిటపట చినుకులు పడుతూ ఉంటే...’ వాన పాటల్లో నంబర్‌వన్. సాహిత్యం, సంగీతం, ముఖ్యంగా ఏయన్నార్, బి.సరోజల కెమిస్ట్రీతో... పాట విన్నప్పుడల్లా మనసులో అనుభూతుల వాన కురవడం మొదలైపోతుంది. వి.బి.రాజేంద్రప్రసాద్‌కు నిజంగానే ఆత్మబలాన్ని ప్రసాదించిందీ సినిమా. క్లైమాక్స్ కట్ చేయకుంటే ఇంకా పెద్ద హిట్టయ్యేది! ‘‘క్లైమాక్స్ సెన్సార్ కట్‌కి గురికాకుండా ఉంటే ఈ సినిమా ఇంకా పెద్ద విజయాన్ని సాధించేది. ఎందుకంటే క్లైమాక్స్ కట్ కావడంతో గ్రాఫ్ హఠాత్తుగా పడిపోయినట్టుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఏంటంటే... హీరోకి ఉరిశిక్ష పడుతుంది. తెల్లవారితే ఉరి తీస్తారు. ఈలోగా హీరోయిన్, అతను నిర్దోషి అని చెప్పే ఆధారంతో జడ్జిని కలుస్తుంది. దాంతో ఉరి ఆగుతుంది. ఇదంతా చాలా డీటైల్డ్‌గా తీశాం. ఇంటర్‌కట్స్ వల్ల ప్రేక్షకునిలో ఉత్కంఠ కలుగుతుంది. సెన్సారాఫీసర్ ఈ ఉత్కంఠ వల్ల ప్రేక్షకుడి గుండె ఆగిపోతుందని వాదించి, ఉరిశిక్షకు సంబంధించిన షాట్స్ అన్నీ కట్ చేయించేశారు’’.