
గౌతమ్ వ్యాస్ ,దీపికా వధాని, స్రవంతి మురళీ మోహన్
గౌతమ్ వ్యాస్ , ‘మిస్ తెలంగాణ’ దీపికా వధానిలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ స్రవంతి మురళీ మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. శ్రీ శివాయ్ ఫిలింస్ పతాకంపై కె.రమేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. స్రవంతి మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జోనర్‌లో రూపొందనున్న చిత్రమిది. మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్ గోవాలో, మూడో షెడ్యూల్ కేరళలో జరగనుంది. నలభై రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తాం. ఈ చిత్రానికి కెమెరా: జిఎస్. రాజ్ (మురళి ), సంగీతం: శివ నందిగామ.
Comments
Please login to add a commentAdd a comment