హత్య కేసులో సినీనటికి జీవిత ఖైదు | Actress sentenced to life for murder of film director | Sakshi
Sakshi News home page

హత్య కేసులో సినీనటికి జీవిత ఖైదు

Published Sat, Apr 25 2015 6:21 PM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

Actress sentenced to life for murder of film director

ఒక దర్శకుని హత్య కేసులో తమిళ సినీ నటికి కోర్టు జీవిత ఖైదు విధించింది.

చెన్నై: ఒక దర్శకుని హత్య కేసులో తమిళ సినీ నటికి కోర్టు జీవిత ఖైదు విధించింది. ఔత్సాహిక చిత్ర దర్శకుడు ఎం.సెల్వ తన దర్శకత్వంలో 2007లో  ఒక చిత్రం నిర్మాణం ప్రారంభించారు. ఆ చిత్రంలో తనకు ప్రాధాన్యతగల పాత్ర ఇవ్వలేదని సరిత అలియాస్ సంగీత అనే నటి ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా అదే సంవత్సరం మార్చి 6న అతనిని ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు  పోలీసులకు ఫిర్యాదు అందింది. దాంతో పోలీసులు అమెను అరెస్ట్ చేశారు. అయితే ఆ తరువాత ఆమె బెయిల్పై విడుదలై పారిపోయింది.

 ఏడు సంవత్సరాల వరకు పోలీసులకు దొరకలేదు. ఎట్టకేలకు గత సంవత్సరం డిసెంబరులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసు విచారణ అనంతరం  నేరం చేసినట్లు రుజువు కావడంతో అదనపు సెషన్స్ జడ్జి చంద్రశేఖర్ ఆమెకు జీవితకాల శిక్ష విధించారు. దాంతోపాటు అయిదువేల రూపాయల జరిమానా కూడా విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement