![Fan Worshipping Yashika Anand, Actress Reacts - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/1/yashikaa-anannad.gif.webp?itok=D2Fpzhjp)
సినీ సెలబ్రిటీలను అభిమానించేవాళ్లు కొందరైతే ఆరాధించేవాళ్లు మరికొంతమంది! ఒక్కోసారి ఈ ఆరాధన ఎక్కువై తారలకు ఏకంగా గుడి కట్టేస్తారు కూడా! అలా తమిళనాడులో ఖుష్బూ, నమితలకు గుళ్లు కట్టేసి పూజలు కూడా చేస్తున్నారు. ఇకపోతే తాజాగా హీరోయిన్ యషికా ఆనంద్‌ను ఓ వ్యక్తి దేవతలా కొలుస్తున్నాడు. ఆమె ఫోటోలకు పూజలు చేస్తూ, హారతి ఇస్తూ ఆరాధిస్తున్నాడు. జీవిత చరమాంకం వరకు తన పాదాలను సేవిస్తూ బతికేస్తానంటున్నాడు. 'వేరే ఏ ఇతర నటి కూడా ఇంత ప్రేమ, భక్తి పొందలేరు. ఆమె పాదాలను పూజించడమే ప్రతి భక్తుడి ప్రథమ కర్తవ్యం' అంటూ యషికా ఫోటోలకు మొక్కుతూ దీపాలు వెలిగిస్తున్న ఫోటోలు షేర్ చేశాడు.
'యషికా దేవతను కొలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. నిజ జీవితంలో భగవంతుడిని చూడలేదు కానీ ఆమెనే దేవతగా చూశాను. జీవితాంతం తనకు భక్తుడిగానే ఉండిపోతాను. నాకున్న ప్రపంచం యషికా దేవతే..' అంటూ ఆమె ఫోటో ఎదుట చేతిలో హారతి కర్పూరం వెలిగించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై యషికా స్పందిస్తూ.. 'నేను కూడా మీలాంటి మనిషినే. ప్రేమను పంచుదాం. పైనున్న భగవంతుడిని మాత్రమే పూజిద్దాం' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది.
చదవండి: నటుడి ఆత్మహత్య.. మరణానికి ముందు చిత్రహింసలు పెట్టిన రెండో భార్య
చాలా త్వరగా వెళ్లిపోయావు, మిస్ అవుతూనే ఉంటా: నమ్రత
Comments
Please login to add a commentAdd a comment