Rachitha Mahalakshmi Complaints on Husband Dinesh - Sakshi
Sakshi News home page

Rachitha Mahalakshmi: అసభ్య సందేశాలు పంపుతున్నాడు.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

Published Wed, Jun 21 2023 3:25 PM | Last Updated on Wed, Jun 21 2023 3:54 PM

Rachitha Mahalakshmi Complaints on Husband Dinesh - Sakshi

ఆన్‌స్క్రీన్‌లో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీళ్లు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ ప్రేమలో పడ్డారు. దీంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కిందట వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో అప్పటినుంచి విడివిడిగానే జీవిస్తున్నారు.

బుల్లితెర నటి రచిత మహాలక్ష్మి తన భర్త దినేశ్‌ కార్తీక్‌ బెదిరిస్తున్నాడంటూ చెన్నై మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్ది రోజులుగా తనకు ఫోన్‌లో అసభ్యకర సందేశాలు పంపుతున్నాడని ఆరోపించింది. పదే పదే మెసేజ్‌లు చేస్తూ తనపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. మంగళవారం అర్ధరాత్రి రచిత పోలీసులను ఆశ్రయించిందన్న విషయం తెలుసుకున్న దినేశ్‌ వెంటనే సదరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. అంతగా కావాలనుకుంటే రచిత కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకోవచ్చని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కాగా పిరివం సంతిప్పమ్‌ సీరియల్‌లో దినేశ్‌ కార్తీక్‌, రచిత మహాలక్ష్మి జంటగా నటించారు. ఆన్‌స్క్రీన్‌లో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న వీళ్లు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ ప్రేమలో పడ్డారు. దీంతో 2013లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం కిందట వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో అప్పటినుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. అయితే నటుడు దినేశ్‌ మాత్రం ఎప్పటికైనా గొడవలు సద్దుమణిగి కలిసుంటామని ఆశిస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే రచిత క్లోజ్‌ ఫ్రెండ్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ జీజీ కూడా గతంలో దినేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన సలహా వల్లే రచిత దినేశ్‌తో విడిపోయిందని అతడు పలు ఇంటర్వ్యూలతో చెప్తున్నాడని ఆరోపించింది. తన వల్లే విడిపోయారని లేనిపోని అభాండాలు వేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

ఇకపోతే రచితా మహాలక్ష్మి పిరివమ్‌, సంతిప్పం ఇళవరసై, శరవణన్‌ మీనాక్షి(వరుసగా మూడు సీక్వెల్స్‌లోనూ తనే నటించింది), నాట్యపురం వంటి సీరియల్స్‌లో ప్రధాన పాత్రలు పోషించింది. తెలుగులో స్వాతి చినుకులు సీరియల్‌లో నటించింది. తమిళ బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లోనూ పాల్గొంది. పారిజాత అనే కన్నడ చిత్రంలో, ఉప్పు కరువద అనే తమిళ చిత్రంలోనూ నటించింది.

చదవండి: బ్యాచ్‌లర్‌ లైఫ్‌కు గుడ్‌బై.. పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్‌ విలన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement