వీడియోతో ట్రోలర్స్‌ నోరు మూయించిన హీరోయిన్‌ | Actress Dharsha Gupta Shares Her Action Sequence Video From Oh My Ghost | Sakshi
Sakshi News home page

Dharsha Gupta: వీడియోతో ట్రోలర్స్‌ నోరు మూయించిన హీరోయిన్‌

Published Wed, Jan 4 2023 9:31 AM | Last Updated on Wed, Jan 4 2023 9:39 AM

Actress Dharsha Gupta Shares Her Action Sequence Video From Oh My Ghost - Sakshi

హీరోయిన్లు గ్లామర్‌ పాత్రలో నటించడం అన్నది పరిపాటే. ఇందుకు నటి దర్శాగుప్త అతీతం కాదు. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎదిగిన నటీమణుల్లో ఈ బ్యూటీ ఒకరు. కుక్‌ విత్‌ కోమాలి అనే టీవీ కార్యక్రమం ద్వారా పాపులర్‌ అయిన దర్శాగుప్త కరోనా కాలంలో పలువురికి చేతనైన సాయం అందించి మంచి మనస్సును చాటుకుంది. అయితే సామాజిక  మాధ్యమాల్లో తరచూ తన గ్లామర్‌ ఫొటోలను విడుదల చేస్తూ యువతను గిలిగింతలు పెడుతూ.. విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా దర్శాగుప్త అందాల ఆరపోతకే లాకీ అంటూ నెటిజన్ల పోస్టులు పెడుతున్నారు.

చదవండి: నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా

కాగా జి మోహన్‌ దర్శకత్వంలో రిచర్డ్‌ హీరోగా నటించిన  రుద్రతాండవం చిత్రంలో హీరోయిన్‌గా నటించి ∙మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఇటీవల విడుదలైన ఓ మై ఘోస్ట్‌ చిత్రంలో నటుడు సతీష్‌కు ప్రియురాలుగా నటించింది. ఈ చిత్రంలో ఎలాంటి డూప్‌ లేకుండా నటించిన ఫైట్‌ సన్నివేశాలను సామాజిక మాధ్యమాల్లో దర్శాగుప్త విడుదల చేసింది. గ్లామర్‌తోనే అవకాశాలు పొందుతున్నట్లు తనపై ముద్ర వేసిన వారికి ఇదే తన సమాధానం అంటూ అందులో పేర్కొంది. దర్శాగుప్త పెట్టిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement