Tamil Serial Actress Vilasini Reveals Reason For Her Divorce- Sakshi
Sakshi News home page

Actress Vilasini: శారీరకంగా, మానసికంగా క్షోభ పెట్టేవాడు

Published Sun, Jul 11 2021 7:09 PM | Last Updated on Mon, Jul 12 2021 11:36 AM

Tamil Actress Vilasini Reveals Reason For Her Divorce - Sakshi

రేడియో జాకీగా కెరీర్‌ ఆరంభించిన విలాసిని తర్వాత యాంకర్‌గా సత్తా చాటింది. తన హోస్టింగ్‌తో పలు షోలను విజయవంతంగా నడిపించిన ఆమె తనలోని నటనా కోణాన్ని వెలికి తీస్తూ బుల్లితెర మీద కూడా సత్తా చాటింది. ఈ సీరియల్‌ నటి సాయి గ్నప్రకాశ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు మొదలయ్యాయి. దీంతో కొంతకాలానికే ఈ దంపతులు విడిగా బతకడం మొదలు పెట్టారు. ఆ తర్వాత విడాకులు సైతం తీసుకున్నారు. తాజాగా తన విడాకుల గురించి స్పందించిందీ నటి.

ఈ సందర్భంగా విలాసిని మాట్లాడుతూ తన భర్త అకృత్యాలను వివరించింది. అతడు ఎన్నో దుర్మార్గపు పనులు చేశాడని చెప్పింది. పలుమార్లు రోజుల తరబడి కనిపించకుండా పోయేవాడని చెప్పుకొచ్చింది. అతడు శారీరకంగానే కాకుండా మాటలతోనూ తనను గాయపర్చేవాడని వాపోయింది. తన దగ్గరి నుంచే కాకుండా తన పేరెంట్స్‌ నుంచి కూడా డబ్బులు గుంజుతూ క్షోభకు గురి చేసేవాడని బాధపడింది. అయితే విడాకుల తర్వాత ఈ బాధల నుంచి ఉపశమనం కలిగిందని, ఇప్పుడు తాను సింగింగ్‌, యాక్టింగ్‌ కెరీర్‌ మీద దృష్టి పెడతానని తెలిపింది. కాగా ఇళయరాజా భార్య సోదరుడి కూతురే విలాసిని. ఈమె యువన్‌ శంకర్‌ రాజా, వెంకట్‌ ప్రభు కజిన్‌గా అందరికీ సుపరిచితురాలే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement