Actress Indraja Sankar Respond Negative Comments On Her Wedding, Deets Inside | Sakshi
Sakshi News home page

Indraja Sankar: నెగిటివ్ కామెంట్స్‌పై ఆవేదన.. నటి ఇంద్రజకి చేదు అనుభవం

Published Wed, May 1 2024 12:07 PM | Last Updated on Wed, May 1 2024 6:06 PM

Indraja Sankar Respond Negative Comments On Her Wedding

ప్రముఖ నటి ఇంద్రజ శంకర్.. సోషల్ మీడియా దెబ్బకు బలైపోయింది. తమిళ నటుడు రోబో శంకర్ కూతురు ఈమె. దళపతి విజయ్ 'విజిల్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసింది. నెల క్రితం చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగి నెల రోజులు కావొస్తున్నా గానీ వివాదాలు మాత్రం ఎక్కువయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భర్తతో కలిసి పాల్గొన్న ఇంద్రజ.. ఆ వివాదాలపై క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: స్టార్ హీరో అజిత్ బర్త్ డే.. అద్భుతమైన గిఫ్ట్‌తో భార్య సర్‌ప్రైజ్)

కార్తీక్ అనే వ్యక్తిని ఇంద్రజ శంకర్ పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుకలకు తమిళ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల దగ్గర చాలామంది సెలబ్రిటీల వరకు హాజరయ్యారు. అయితే పెళ్లిలో ఇంద్రజ తన తండ్రికి ముద్దు పెట్టడం, కార్తీక్.. ఇంద్రజ తల్లితో డ్యాన్స్ చేయడంపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేశారు. అయితే వాటిని దురుద్దేశంతో చూడొద్దని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది.

అలానే భర్తతో కలిసి తాను ఓ ఫొటోని పోస్ట్ చేయగా.. దానికి అసహ్యకరమైన కామెంట్స్ వచ్చాయని ఇంద్రజ శంకర్ చెప్పుకొచ్చింది. 'నా మీద ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అతడి పేరు సరిగా గుర్తులేదు. 'ఇప్పుడు కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ ఎక్కువరోజులు కలిసుండలేరు. కొన్నిరోజులు ఆగితే విడివిడిగా ఇంటర్వ్యూ ఇస్తారు. త్వరలో విడాకులు తీసుకుంటారు' అని ఆ వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇలా కామెంట్స్ పెట్టడంతో నేను చాలా బాధపడ్డాను. అయినా వేరొకరి గురించి అలా ఎలా కామెంట్ చేస్తారు?' అని ఇంద్రజ తన ఆవేదనని చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా? సాయిపల్లవి ఆన్సర్ ఇదే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement