
ప్రముఖ సినీనటి కికీ విజయ్‌తో పాటు సామాజికవేత్తలు కవితా పాండియన్, దీపా మదన్ పాల్గొని ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
కొరుక్కుపేట (తమిళనాడు): ఔత్సాహిక ఫ్యాషన్ డిజైనర్‌లను ప్రోత్సహించటమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు సూత్ర సంస్థ యజమానులు మోనికా, ఉమేష్ తెలిపారు. చెన్నై నుంగంబాక్కంలోని తాజ్ కొరమండల్ వేదికగా రెండు రోజుల సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్‌ను మంగళవారం ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీనటి కికీ విజయ్‌తో పాటు సామాజికవేత్తలు కవితా పాండియన్, దీపా మదన్ పాల్గొని ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
ఉదయం10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే ఈ ప్రదర్శన బుధవారంతో ముగుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఆధునిక, సంప్రదాయ వస్త్రాలు, ఇతర మహిళా ఉత్పత్తుల మేళవింపుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ నగరవాసులకు అమితంగా ఆకట్టుకుంటుండగా, ఇందులో దేశంలోని 100కి పైగా ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన సరికొత్త ఉత్పత్తులను చెన్నై ఫ్యాషన్ ప్రియులకు అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
చదవండి: అలా అన్నందుకు సందీప్ తండ్రి చాలా సీరియస్ అయ్యారు : ‘మేజర్’ నిర్మాతలు
నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో అదిరిపోయిందిగా