పెరంబూరు (చెన్నై): సహాయ నటి యాషికా అలియాస్ ఎస్తర్ ప్యూలా రాణి 12వ తేదీన ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మన్నర్ వగైయార్ చిత్రంలో నటించిన ఆమె పెరంబూరుకు చెందిన మోహన్‌బాబు అలియాస్ అరవింద్‌తో సహజీవనం చేసింది. ఇద్దరి మధ్య వివాదాల కారణంగా మోహన్‌బాబు ఆమెను విడిచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపంతో యాషికా ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో పెరంబూరు పోలీసులు మోహన్‌బాబును అరెస్ట్ చేశారు. విచారణలో యాషికా చనిపోయే ముందు తన భర్తకాని భర్తకు రాసిన ఓ లేఖ బయటపడింది.
అందులో ‘హాయ్ మొగుడా. ఐ లవ్ యూ సోమచ్. నువ్వంటే నాకు ప్రాణం. నీకే నాపై ప్రేమ లేదు. నిన్ను నమ్మే కదా నేను వచ్చాను. అన్నీ విషయాల్లోనూ సర్దుకుపోయాను. నువ్వు లేకుంటే నేను ఒక్క క్షణం కూడా జీవించలేను. నేనంటే నీకెంత ఇష్టమో తెలియదుగానీ.. నువ్వంటే నాకు చాలా ప్రేమ. నీకు ఎవరి గురించి అవసరం లేదు. నాపై అసలు ఫీలింగే లేదు. ఏడాది పాటు భార్యాభర్తలుగా కలిసి జీవించాం. నాకు నీతోనే కలిసి జీవించాలని ఆశగా ఉంది. నేను అన్నం తిని మూడు రోజులైంది. నువ్వు లేకపోవడంతో అన్నం కూడా సహించడం లేదు. నిన్ను కష్ట పెట్టను. నేను చనిపోయినా నా గురించి తలచుకుంటావో లేదో తెలియదు. నాకు మాత్రం నువ్వు లేకపోతే జీవించడం సాధ్యం కావడం లేదు. ఐ లవ్ యూ మామా.. ఐలవ్ యూ అరవింద్, మొగుడా.. నేను వెళ్లిపోతున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలని అన్నీ చేసి పెట్టాను. అన్నీ వదిలేస్తున్నాను’ అని యాషికా పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment